అగ్ర రాజ్యంగా నిత్యం ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా.. తానేమిటన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా కొన్నిసార్లు చెప్పేస్తుంది. అప్పటివరకూ అమెరికా అంటే విపరీతమైన ఆరాటాన్ని ప్రదర్శించే వారు సైతం.. అగ్రరాజ్యం స్వార్థాన్ని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా ఇరాన్ సైనిక చీఫ్ ను డ్రోన్లతో దారుణంగా హతమార్చటం.. అదేమంటే.. అతనో ఉగ్రవాది.. అతని కారణంగా ప్రపంచానికి ప్రమాదమని చెప్పేయటం తెలిసిందే. పెద్దన్న తీరుతో ఇరాన్.. ఇరాక్ లు భగ్గుమనటమే కాదు.. అంతకంతకూ బదులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇరాక్ పార్లమెంటు లో ఒక తీర్మానాన్ని చేశారు. దాని ప్రకారం అమెరికా కు చెందిన సైనికులు దేశాన్ని ఖాళీ చేసి వెళ్లి పోవాలని వారు నిర్ణయించారు. ఇదే విషయాన్ని తీర్మానం రూపంలో చేయటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. పెద్దన్న మార్క్ వార్నింగ్ లు షురూ చేశారు.
తొలుత ఇరాక్ పై భారీ ఆంక్షలు తప్పవన్న ఆయన.. ఆ తర్వాత కొత్త మెలికను తెర మీదకు తీసుకొచ్చారు. ఇరాక్ నుంచి తమ సైనికులు తిరిగి వెళ్లి పోవాలంటే అక్కడ నిర్మించిన భారీ వైమానిక స్థావరానికి పరిహారం చెల్లించాలని.. అంతవరకూ తమ సేనల్ని ఉపసంహరించుకునేది లేదని తేల్చేశారు. ఇరాక్ లో తాము చాలా ఖర్చు చేశామని.. వాటిని చెల్లించిన తర్వాతే తాము ఇరాక్ ను ఖాళీ చేస్తామని చెప్పిన తీరు చూస్తే.. పెద్దన్నతో డీల్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థమై పోతుంది.
ఇదిలా ఉంటే.. తమ చీఫ్ సులేమానీని హతమార్చిన దానికి అమెరికా మూల్యం చెల్లించుకోవాలని.. ప్రతిదాడి తపదన్న ఇరాన్ అధినేత మాటలకూ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఇరాన్ ఎలాంటి ప్రతీకార దాడికి సిద్ధపడినా.. అమెరికా నుంచి అంతకు మించిన భారీ ప్రతిదాడి ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్ని కలవర పాటుకు గురి చేస్తోంది. చిలికి చిలికి గాలివానలా మారి.. ఈ వ్యవహారం చివరకు మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.