ట్రంప్ మళ్లీ గెలిచాడు..

Update: 2016-12-14 11:51 GMT
నవంబరు 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఆ ఎన్నికల్లో ఎన్నో అంచనాలున్న హిల్లరీ క్లింటన్ ను ఆయన చిత్తుగా ఓడించారు. తాజాగా మరోసారి ఆయన హిల్లరీపై గెలుపు సాధించారు. అవును... అదే ఎన్నికలకు సంబంధించిన రీ కౌంటింగ్ లో ఆయన మరోసారి విజేతగా నిలిచారు.
    
ట్రంప్ గెలుపుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ గ్రీన్ పార్టీ అభ్యర్థిని జిల్ స్టెయిన్ అక్కడి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పెన్సిల్వేనియా - మిషిగన్ - విస్కాన్సస్ రాష్ట్రాల్లో రీకౌంటింగ్ కోరారు. ఆ మేరకు రీకౌంటింగ్ నిర్వహించగా ట్రంప్ విజయం మరోసారి నిరూపితమైంది. పాత లెక్కకు ఇప్పటికి 0.06 శాతం మాత్రమే తేడా కనిపించిందట.
    
దీంతో ఈ నెల 19న ఎలక్టోరల్ కాలేజి పోల్సులో ఫలితాలు తారుమారు అవుతాయని భావిస్తున్న హిల్లరీ - డెమొక్రటిక్ పార్టీ వర్గాలకు దీంతో షాక్ తగిలినట్లయింది. మునుపెన్నడూ లేనట్లుగా ఎన్నికైన అభ్యర్థిపై వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి కానీ.. ఫలితాలు మాత్రం ట్రంప్ కే ఇంకా అనుకూలంగా ఉండడంతో ఆయన్ను ఎవరూ అడ్డుకోలేరని తేలిపోయింది.       


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News