ట్రంప్ వాడే ఫోన్ చూస్తే దిమ్మతిర‌గాల్సిందే

Update: 2017-01-21 16:58 GMT
ప్రపంచ పెద్ద‌న్నగా పేరొందిన అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత ఆస‌క్తిక‌ర‌మైన వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చెప్పేసే మాట తీరుతో ప్ర‌పంచం చూపును త‌న‌వైపు తిప్పుకొన్న ట్రంప్ ఇపుడు అధ్య‌క్షుడు అయిన నేప‌థ్యంలో త‌న ప్రియ‌మైన వ‌స్తువును వ‌దిలిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. అదే ట్రంప్ ఇష్ట‌ప‌డే శాంసంగ్ ఫోన్ ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది. ఈ నిర్ణ‌యం ట్రంప్ కు క‌ష్టం అయిన‌ప్ప‌టికీ భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా ఆయ‌న పాటించాల్సి వ‌స్తోంది.

అమెరికా అధ్య‌క్షుడిగా అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌లో ఉండే ట్రంప్ ప్ర‌స్తుతం ఉప‌యోగిస్తున్న శాంసంగ్ ఫోన్ వ‌ల్ల స‌మాచారం హ్యాక్ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆ దేశ భ‌ద్ర‌త విభాగం స్ప‌ష్టం చేసింది. అందుకే ట్రంప్ మ‌రో ఫోన్ వాడాల‌ని ట్రంప్ కు స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా బ్లాక్ బెర్రీ సంస్థ రూపొందించిన స్మార్ట్ ఫోన్ ఉప‌యోగించాల‌ని సూచించింది. పేరుకే స్మార్ట్ ఫోన్ అయిన‌ప్ప‌టికీ ఇందులో స్మార్ట్ ఫోన్ లో ఉండే ఫీచ‌ర్స్ అయిన కెమెరా, మ్యూజిక్ ప్లేయ‌ర్‌, టెక్ట్స్ మెసేజ్ సౌల‌భ్యం వంటివి కూడా లేవు. దీంతో పేరులోనే స్మార్ట్ త‌ప్ప నిజంగా స్మార్ట్ ఫోన్ కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఇదిలాఉండ‌గా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ తొలిరోజు క్షణం తీరిక లేకుండా గడిపారు. ఒబామా కేర్ ఆరోగ్య పథకం నిబంధనల సడలింపు ఫైల్‌పై ట్రంప్ తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఒబామా కేర్‌ను రద్దు చేస్తామని ట్రంప్ హామీ ఇచ్చిన విషయం విదితమే. ఒబామా కేర్ పథకం స్థానంలో ట్రంప్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం వెల్లడించలేదు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కీలక మార్పులు చేయించారు. వైట్‌హౌస్ ప్రాంగణంలో ఇంతకుముందు విన్‌స్టన్ చర్చిల్ విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని తీసేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం పెట్టించారు. అలాగే ఇంతకుముందున్న క్రిమస్సన్ డ్రేప్స్‌ను తీసి బంగారు డ్రేప్స్ వేలాడదీశారు.  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే కంటే ముందు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ అమెరికా మిలటరీ అధికారులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. నృత్యం చేసిన వారిలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన సతీమణి కరేనా కూడా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News