అనూహ్యమైన సంచలన నిర్ణయాలకు కేరాప్ అడ్రస్ గా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన షాకుల పరంపరలోనూ ఒకింత స్వీట్ న్యూస్ చెప్పారు. చిన్నతనంలో వలస వచ్చిన డ్రీమర్లను అమెరికా నుంచి గెంటివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంలో భారతీయులు దాదాపుగా 20వేల మంది అమెరికాలో నిరాశ్రయులు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ట్రంప్ తీపికబురు తెలిపారు. వచ్చే ఆరు మాసాల్లో ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించి ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని డ్రీమర్లకు ట్రంప్ హామీ ఇచ్చారు.
డ్రీమర్ల ఇమ్మిగ్రేషన్ ప్రణాళికకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనాల్సిందిగా అధ్యక్షుడు కాంగ్రెస్ కు ఆరు మాసాల గడువును ఇచ్చారు. ఈ ఆరు మాసాల్లోగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ట్విట్టర్ లో ట్రంప్ హామీ ఇచ్చారు. 2012లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకువచ్చిన పథకం డిఎసిఎ లబ్దిదారులపై తమ ప్రభుత్వం ఈ గడువులోగా ఎలాంటి చర్య తీసుకోదని స్పష్టం చేశారు. ప్రతినిధుల సభలో మైనారిటీ నేత నాన్సీ పెలోసితో టెలిఫోన్ లో చర్చలు జరిపిన వెంటనే ట్రంప్ ట్వీట్ చేశారు. 2018 మార్చి 5తో ముగిసే ఆరు మాసాల గడువులోగా డ్రీమర్లను దేశం నుండి వెలుపలకు పంపేది లేదని చెప్పారు. కాగా, అంతకుముందు ట్రంప్‌తో జరిపిన ఫోన్ చర్చల సారాంశాన్ని పెలోసి - డెమోక్రాట్ల సమావేశంలో సభ్యులకు తెలియచేశారు. అన్ని పక్షాలతో చర్చలు జరపాలన్న ప్రణాళికలో భాగంగా ట్రంప్ - పెలోసితో చర్చలు జరిపారని - ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రియాన్ తో - రిపబ్లిక్ నేత మెక్ కానెల్ తో కూడా చర్చలు జరిపారని వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు.
చిన్నపిల్లలుగా వున్నపుడు తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చినవారిని డ్రీమర్లు లేదా స్వాప్పికులుగా పరిగణిస్తారు. ఇప్పుడు వారిని అమెరికా నుండి పంపివేయాలన్నది ట్రంప్ ఆలోచనగా వుంది. డీఏసీఏలో ఇప్పటికే చేరినవారు వారి పర్మిట్లు కాలం చెల్లేవరకు ఇక్కడే ఉండవచ్చు. 2018 మార్చి కన్నా ముందుగా వారి పర్మిట్లకు కాలం చెల్లితే మరో రెండేళ్ళపాటు వారు తమ పర్మిట్ ను పునరుద్ధరించుకోవచ్చు. అయితే కొత్త దరఖాస్తులేవీ కూడా ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ నిర్ణయంతో తాము సంతృప్తి చెందుతున్నామని కొంతమంది మద్దతుదారులు చెప్పారు.మరోవైపు ట్రంప్ ఈ నిర్ణయం కంటే ముందే ట్రంప్ చర్యలను నిలువరించేందుకు 15 రాష్ట్రాలు - కొలంబియా జిల్లా కేసు దాఖలు చేశాయి. న్యూయార్క్ - మసాచుసెట్స్ - వాషింగ్టన్ - కనెక్టికట్ - డెల్వార్ - కొలంబియా డిస్ట్రిక్ట్ - హవాయి - ఇల్లినాయిస్ - అయోవా - న్యూ మెక్సికో - నార్త్ కరోలినా - ఓరెగావ్ - పెన్సిల్వేనియా - రోడ్ ఐలాండ్ - వెర్మాంట్ - వర్జీనియాలు కేసు వేశాయి. న్యూయార్క్ తూర్పు జిల్లాలో ఈ కేసు నమోదైంది.