వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థికి డోనాల్డ్ ట్రంప్ కు కాలం వకలిసి వచ్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒర్లాండోలోని నైట్ క్లబ్ లో జరిగిన నరమేధం ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. మతఛాందస ఇస్లామిక్ ఉగ్రవాదంపై గతంలో చేసిన వ్యాఖ్యలను ఒర్లాండో ఘటన తర్వాత ట్రంప్ మరోసారి సమర్థించుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
ఒర్లాండో ఘటన తర్వాత ఘోరకలిని ఖండిస్తూ వెంటనే ట్రంప్ ట్వీట్లు చేశారు. నైట్ క్లబ్ విషాదం ఇస్లామ్ పట్ల ఉన్న తన అభిప్రాయాలను సూచిస్తుందన్నారు. తన ఆలోచన పట్ల ప్రజల కృతజ్ఞతలు తనకు అవసరం లేదని, మరింత దృఢంగా, మరింత నిఘాతో ముందుకు వెళ్లాలని ట్రంప్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల స్మార్ట్ గా వ్యవహరించాలన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల తన వాదన నిజమేనని, అమెరికాలోకి ముస్లింలను రానివ్వొద్దన్న వాదనకు రెండితంలు కట్టబడి ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఒర్లాండో ఘటన వెనుక ఉన్నది ఇస్లామిక్ ఉగ్రవాదమే అని అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అంగీకరించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఒబామా ఆ విషయాన్ని గుర్తించలేని పక్షంలో అతను వెంటనే పదవి నుంచి దిగిపోవాలన్నారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్న హిల్లరీ క్లింటన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఆ అంశాన్ని వెల్లడించాలన్నారు. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతే దేశం చిన్నాభిన్నమవుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీపడనున్నారు. ఇటీవల అమెరికాలో దాడులు పెరిగిపోవడం, అందులో ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన మద్దతుదారులు తరుచూ కాల్పులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నైట్ క్లబ్ ఊచకోత లాంటి ఘటనలు ట్రంప్‌కు అనుకూలిస్తాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో భయాందోళనలకు గురవుతున్న అమెరికన్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపిస్తారా లేదా ఇప్పుడే అంచనా వేయలేమని కూడా అంటున్నారు.