దీపావళి వేడుకల్లో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్

Update: 2019-10-26 06:14 GMT
ఇండియన్స్ జరుపుకునే పండుగలలో దీపావళికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు మొదలైపోయాయి. ఈ దీపావళి పండుగ భారతీయుల కంటే ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  చేసుకున్నారు. ఓవల్ ఆఫీస్ లో శుక్రవారం జరిగిన  దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు.

భారత్ లో దీపావళి వేడుకలను జరుపుకోవడానికి మూడు రోజుల ముందే వైట్ హౌస్ లో సంబరాలు జరిగాయి. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ప్రారంభించారు. అప్పటినుండి ప్రతి ఏడాది కూడా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు జరుపుతారు. ఇక 2017లో భారత సంతతి అమెరికా నేతలతో కలసి ట్రంప్ తొలి సారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీపావళి వేడుకలను ట్రంప్ జరుపుకోనుండటం ఇది మూడోసారి కావటం విశేషం.

2018 సంవత్సరంలో వైట్ హౌస్ లోని రూజ్ వెల్డ్ రూమ్ లో జరిగిన దీపావళి వేడుకలకు ట్రంప్ అమెరికా భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నాను ఆహ్వానించారు. కాగా ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్  భారతీయులు..అమెరికా వాసులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. అలాగే దీపావళి సందర్భంగా భారతీయులకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పండుగ మరిన్ని వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాగే నేడు దీపావళి అమెరికా అంతటా జరుపుకుంటున్నారు అని ,దేశ ప్రధాన సిద్దాంతాలలో ఒక్కటైన మతస్వేచ్ఛ కి ఈ పండుగ నిదర్శనం అని తెలియజేసారు. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాసాలకి అనుగుణంగా పండుగలు , పూజలు జరుపుకునే హక్కు అమెరికా కల్పిస్తుంది అని తెలిపారు. ఈ దీపావళి పండుగని భారతీయులు రేపు ( ఆదివారం) జరుపుకోనున్నారు.
Tags:    

Similar News