అది.. ఇది.. ఏదైనా సరే వ్యాపారానికి అనుకూలమే. చివరకు ద్వేషం కూడా బిజినెస్ చేయొచ్చన్న వైనాన్ని తాజాగా ఒక పెద్ద మనిషి చేతల్లో చేసి చూపిస్తున్నాడు. లండన్‌కు చెందిన ఒకతను ట్రంప్ మీద ఉన్న విద్వేషాన్ని వెరైటీగా వ్యాపారం చేసేస్తున్నాడట. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ద్వేషించే వారు ఎంతలా ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచాధినేత మీద ఉన్న ద్వేషాన్ని సొమ్ము చేసుకునేందుకు కాస్తంత వెరైటీ ఆలోచించాడో వ్యక్తి.
లండన్ లో యాంటీ ట్రంప్ థీమ్ తో ట్వంప్స్ పేరుతో ఒక బార్ ను ఏర్పాటు చేశారు. ఈ బార్ లో ట్రంప్ గౌరవాన్ని తగ్గించటానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టరు. బార్ లోపల గోడల మీద ట్రంప్ చిత్ర విచిత్రమైన హావభావాలతో కూడిన ఫోటోల్ని.. ఆయన్ను వికృతంగా.. తక్కువ చేసి చూపించేలా ఉన్న క్యారికేచర్లను ఏర్పాటు చేశారు.
ఈ బార్ నిర్మాణం సైతం అమెరికాలోని ట్రంప్ టవర్స్ లో ఉన్న ట్రంప్ పెంట్ హౌస్ ను పోలి ఉండేలా ఏర్పాటు చేయటం విశేషం. మరింతలా ట్రంప్ తీరును కాపీ చేసిన ఈ బార్ లో సర్వ్ చేసే పానీయాలు సైతం ట్రంప్ పేరుతోనే ఉంటాయి. ట్రంప్ టవర్ విస్కీ సోర్.. ప్యారిస్ డీల్ ప్రొసెక్కో.. మెక్సికన్ వాల్ మార్గరీటా.. ఇలాంటి ట్రంప్ ను అందరూ తప్పు పట్టే అంశాలను పోలి ఉండే పేర్లతో సర్వ్ చేస్తారట. ఇదంతా విన్నప్పుడు ఒక అధినేత ఇమేజ్ ను ఇంతగా డ్యామేజ్ చేస్తారా? అన్న ఆగ్రహం కలగొచ్చు. కానీ.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ట్రంప్ మీద ఉన్న ద్వేషంతో బిజినెస్ చేస్తున్న అతగాడు.. అందరూ కన్వీన్స్ అయ్యేలా తన బిజినెస్ కున్న లక్ష్యాన్ని చెప్పి మనసు దోచేసుకుంటున్నాడు. ట్రంప్ ను చెడుగా చూపిస్తున్నప్పటికీ.. ఈ బార్ మీద వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని.. ఈ బార్ లో అమ్మే ప్రతి పానీయం మీదా వచ్చే లాభంలో కొంత మొత్తాన్ని ట్రంప్ కారణంగా నష్టపోయే విదేశీయులకు.. వారి హక్కుల కోసం పోరాడే వారికి.. ముస్లిం దేశాల్లోని కుటుంబాలకు అందిస్తూ మన్నన పొందుతున్నాడు. ద్వేషంతో వ్యాపారం చేయాలన్నా కూసింత తెలివి కూడా అవసరమన్న విషయం ఈ బార్ ను చూస్తే అర్థం కాక మానదు.