అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు ఎంత భిన్నమో తెలిసిందే. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు అర్థం కాదు. తన నోటి తీటతో ఇప్పటికే ఎన్నో సమస్యల్ని నెత్తిన వేసుకున్న ఆయన.. తన తీరును ఎంతకూ మార్చుకోలేదన్న విషయం తెలిసిందే. నోటి దురుసుతనంతో ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాక ఆయన చుట్టూ ఉన్న వారు కిందామీదా పడిపోతుంటారు. తాజాగా తన తీరుకు తగ్గట్లే మాట్లాడినప్పటికీ.. ఆయన మాటలన్నీ సరదాగా సాగటంతో నవ్వులతో ముగిసింది. ఇంతకీ జరిగిందేమంటే..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రాయబారిగా పని చేస్తున్న అధికారులతో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ పలు సలహాలు.. సూచనలు చేశారు. ఈ సమయంలోనే ఆయన ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి నిక్కీ హేలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె చాలా బాగా పని చేస్తుందని.. ఎవరైనా అలా చేస్తున్నారా? ఒకవేళ ఆమె అలా పని చేయకుంటే నిక్కీని ఈజీగా పదవి నుంచి పీకేసి వేరే వారితో భర్తీ చేయగలనంటూ వ్యాఖ్యానించారు.
ఆ వెంటనే.. నిక్కీ హేలీ అద్భుతంగా పని చేస్తుందని.. ఆమెను పదవి నుంచి పీకేసే పని అస్సలు చేయలేమంటూ కవర్ చేస్తూ.. ఆమె పని తీరు నిజంగా వండర్ ఫుల్ అంటూ పొగిడేయటంతో అక్కడ వాతావరణం మరింత పాజిటివ్ గా మారింది. ఒక మహిళా అధికారిని.. ఆమె పని తీరును ట్రంప్ విపరీతంగా పొగిడేస్తున్న వేళ.. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులతో సహా.. నిక్కీ హేలీ చిరునవ్వులు చిందించారు. ఆ మధ్యన ట్రంప్ గురించి మాట్లాడుతూ.. ఆయన్ను పొగిడేసిన నిక్కీ హేలీ.. తనకు ట్రంప్ పూర్తిస్వేచ్ఛను ఇచ్చినట్లుగా చెప్పటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/