ట్రంప్ ‘ఫోర్స్ వన్’ వైభోగమే వైభోగం

Update: 2016-06-30 07:00 GMT
అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ గురించి చాలామందికి తెలిసిందే. దాని శక్తి.. సామర్థ్యాల గురించి కథలు కథలుగా చెబుతారు. అయితే.. దానికి తగ్గట్లే అని చెప్పలేం కానీ.. ఆ తరహాలోనే ఒక ప్రైవేట్ చాఫర్ ఉండటం అంత చిన్న విషయమేమీ కాదు. ఇంతకీ అలాంటి సొంత విమానం ఉన్నది ఎవరికో కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగనున్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఇలాంటి విమానం ఉంది. దీన్ని ‘ట్రంప్ ఫోర్స్ వన్’’గా వ్యవహరిస్తుంటారు.

ఈ భారీ విమానంలో 200 మంది కూర్చునే అవకాశం ఉన్నా.. ట్రంప్ మాత్రం 43 మంది మాత్రమే ప్రయాణించేలా రీ డిజైన్ చేయించారు. తన ఎన్నికల ప్రచారానికి ట్రంప్ ఈ విమానాన్ని వినియోగిస్తుంటారు. ఈ విమానంలోని సీటు బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం పూత ఉండటమే కాదు.. ఈ ఫ్లైట్ బాత్రూంలోని ట్యాప్ లకు గోల్డ్ తో కవర్ చేయటం గమనార్హం.

కొన్నేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్లెన్ నుంచి కొనుగోలు చేసిన ఈ విమానాన్ని తన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయించిన ట్రంప్.. ఈ విమానం మీద తన పేరును ప్రముఖంగా రాయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు వినియోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విలువ 325 మిలియన్ డాలర్లు ఉంటే.. ట్రంప్ విమానం విలువ 100 మిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం.

ఇక.. విమానంలో ఉండే అత్యాధునిక సాంకేతికత తో పాటు.. అందులోని సౌకర్యాల గురించి చాలానే చెప్పుకోవచ్చు. మీటింగ్ హాల్స్..బెడ్ రూంలు.. బాత్రూంలతో సహా సౌకర్యాలకు కొదవ ఉండదు. ఇన్ని ఉన్నాయి కాబట్టే అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ తో ట్రంప్ ఫోర్స్ వన్ అని పిలుస్తుంటారు మరి. అందుకే పలువురు.. ట్రంప్ విమానం చూస్తే చాలు.. అతగాడెంత సౌండ్ పార్టీనో తెలుస్తుందని చెబుతుంటారు. అందులో నిజం ఉంది కదూ.
Tags:    

Similar News