అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగనున్న డోనాల్డ్ ట్రంప్ పేరు చెప్పిన వెంటనే.. ఇష్టారాజ్యంగా మాట్లాడతారని.. బాధ్యత లేకుండా వ్యవహరిస్తారని.. విపరీతమైన పొగరు.. అహంకారం లాంటి మాటలెన్నో చటుక్కున గుర్తుకు వస్తాయి. అయితే.. దీనికి భిన్నంగా కూడా ట్రంప్ వ్యవహరిస్తారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తన ముద్దుల భార్య ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన వ్యక్తిని క్షమించటమే కాదు.. అతని తప్పును పొరపాటుగా పరిగణించి ఓకే అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తన భర్తను పొగిడేస్తూ. ఈ మధ్యన ట్రంప్ సతీమణి మెలానీ ట్రంప్ చేసిన ప్రసంగంపై పలు విమర్శలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ప్రసంగాన్ని మెలానీ కాపీ కొట్టినట్లుగా పలువురు విమర్శలు చేశారు. అయితే.. ఈ తప్పంతా మెలానీది కాదని.. ఆమెకు ప్రసంగ పాఠాన్ని తయారు చేసిన ట్రంప్ ఉపన్యాస రచయిత మెరిడిత్ మెక్ ఇవర్ అన్న విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. అంతేకాదు.. తాను చేసిన తప్పునకు ట్రంప్ సతీమణి ఇమేజ్ మీద దెబ్బ పడిందని ఫీలై.. జరిగిన దానికి సారీ చెప్పటమే కాదు తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. స్పీచ్ రైటర్ మెరిడిత్ తప్పును ట్రంప్ లైట్ తీసుకున్నారు. తప్పులు చేయటం సహజమని.. ఆ అనుభవాల నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలని చెబుతూ.. రాజీనామా లేఖను తిరస్కరించారట. ఈ విషయాన్ని కూడా స్పీచ్ రైటర్ మెరిత్ వెల్లడించారు. తన తప్పును అర్థం చేసుకున్న ట్రంప్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. కరుకుగా వ్యవహరిస్తారన్న పేరున్న ట్రంప్ లో ఈ కోణం కాస్త కొత్తే కదూ..?