అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై రీకౌంటింగ్ అంశంపై వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 8వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్ తో పాటు ఇతర స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా - మిచిగాన్ లలో తన ప్రత్యర్థి - డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వింగ్ స్టేట్ గా పరిగణించే విస్కాన్సిన్ రాష్ట్రంతో పాటు మిచిగాన్ - పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా రీకౌంటింగ్ జరపాలని గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జిల్ స్టెయిన్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి అధికారిక అనుమతి వచ్చిన నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించిన అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాలను ఎవరూ శంకించడం గానీ, అగౌరవపర్చడం గానీ చేయరాదని, ఆ ఫలితాలను ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలని ట్రంప్ అన్నారు. విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలన్న నిర్ణయాన్ని ‘కుంభకోణం’గా ఆయన అభివర్ణించారు. ఈ డిమాండ్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విస్కాన్సిన్ లో మళ్లీ ఓట్లు లెక్కించాలని పట్టుబడుతున్న వారిలో ముందున్న గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జిల్ స్టెయిన్ కేవలం ఆ ఒక్క రాష్టంల్రోనే కాకుండా మిచిగాన్ - పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడానికి ముందు ఈ రాష్ట్రాల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు ఆ ఎన్నికలు పూర్తయ్యాయని, వాటి ఫలితాలను ఎవరూ శంకించడం గానీ, అగౌరవపర్చడం గానీ చేయకుండా అందరూ గౌరవించి తీరాలని వాదిస్తుండటం గమనార్హం.
ఇదిలా ఉండగా..నియంత్రణ రేఖ వద్ద (ఎల్ వోసీ) ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి పత్తి - కూరగాయలతో సహా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని నిషేధిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. వాఘా సరిహద్దు - కరాచీ ఓడరేపు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిని నిషేధిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ వెల్లడించిందని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. తమ రైతులను రక్షించడానికి భారత్ నుంచి టమాట - ఇతర కూరగాయల దిగుమతిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఒకవేళ మార్కెట్ లో కొరత ఏర్పడితే భారత్ నుంచి దిగుమతి చేసుకుంటామని డీపీపీ చీఫ్ తెలిపారు. పత్తిలో భారతీయ వ్యాపారులు జీవభద్రత ప్రమాణాలకు పాటించడం లేదని తమకు నివేదిక వచ్చిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/