అసలే ట్రంప్. ఇక.. ఆయన మాటలు ఎప్పుడెలా ఉంటాయో ప్రత్యేకించి ఎవరూ చెప్పలేని పరిస్థితి. సంచలన వ్యాఖ్యల్ని అలవోకగా చెప్పేసే ట్రంప్ నకు ఎవరు ఎప్పుడు ఎందుకు నచ్చుతారో ఒక పట్టాన అర్థం కాదు. కొందరిని ఆకాశానికి ఎత్తేసేటట్లు మాట్లాడే ట్రంప్.. మరికొందరిపై నిప్పులు కురిపిస్తారు. తాజాగా ఒక సింగర్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ అమెరికన్ గాయకుడు కాన్యే వెస్ల్ తాజాగా వైట్ హౌస్ కు వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. అమెరికాలోని జైళ్ల సంస్కరణల గురించి ట్రంప్ తో మాట్లాడతానని చెప్పిన కాన్యే వైట్ హౌస్ కు వచ్చారు. మీడియా సమక్షంలోనే ట్రంప్ తో కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా ట్రంప్ ను కాన్యే పొగిడేస్తే.. ట్రంప్ మరో మెట్టు ముందే ఎక్కేసి.. రాబోయే రోజుల్లో కాన్యే అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉందన్న సంచలన వ్యాఖ్య చేశారు. కాన్యే తనకు చిరకాల మిత్రుడని.. అతనికి అధ్యక్షుడయ్యే అర్హత ఉందన్నారు. ర్యాలీలో కాన్యే చేత ప్రసంగాలు ఇప్పిస్తారా? అమెరికా అధ్యక్ష పడవికి పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు బదులిచ్చిన ట్రంప్.. భవిష్యత్తులో కాన్యే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఆయనకు ఆ అర్హత ఉందన్న ట్రంప్.. కాన్యే తనతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడొచ్చని.. అతనుస్మార్ట్ వ్యక్తి అని.. తాను చెప్పిన విషయాల్ని చప్పున అర్థం చేసుకుంటాడంటూ పొగిడేశారు.
కాన్యేను ట్రంప్ భారీ ఎత్తున పొగిడేస్తున్న వేళ.. ఒక మహిళా జర్నలిస్టు ఒక ప్రశ్నను సంధించారు. ట్రంప్ జాతివివక్ష చూపిస్తూ ఉండటంపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు బదులిచ్చిన కాన్యే .. ఇలాంటి ప్రశ్నలకు తాను సింఫుల్ గా సమాధానం చెప్పనంటూ తెలివిగా తప్పించుకున్నారు. మొత్తానికి ఒక సింగర్ కు అమెరికా అధ్యక్షుడు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెప్పి సంచలనం సృష్టించారని చెప్పాలి. నిజమే.. ట్రంప్ లాంటోడే అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు.. ఆయన చెప్పినట్లుగా కాన్యే లాంటి సింగర్ అమెరికా అధ్యక్షుడు కావటానికి అడ్డంకులు ఏముంటాయి చెప్పండి?