కరోనా ఎంతమందిని చంపుతుందో చెప్పిన ట్రంప్
కరోనా తో ఎంతమంది చస్తారు? ఎంత నయం అవుతుందనేది ఊహించడం కష్టం. వైరస్ అంతుచిక్కడం లేదు. మందు లేదు. దీంతో దీని బారిన పడి ప్రాణాలు పోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ తో లక్షమంది మరణించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ఇన్నాళ్లు 60-80వేల మంది అమెరికన్లు మాత్రమే చస్తారని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తాజాగా ఆ సంఖ్యను లక్షకు పెంచడం చర్చనీయాంశమైంది.
ఈ సంవత్సరాంతం లోగా కరోనాకు ఉచిత చికిత్సగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని ట్రంప్ తెలిపారు. లాక్ డౌన్ తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ మీద ప్రధానంగా దృష్టిపెట్టామని ట్రంప్ తెలిపారు.లాక్ డౌన్ ఎత్తి వేయడంతో సగానికి పైగా రాష్ట్రాల్లో తిరిగి జనజీవనం ప్రారంభమైంది. కార్యాలయాల్లో ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ఫ్లోరిడా, కాలిఫోర్నియా బీచ్ లలో సందర్శకులు పోటెత్తుతున్నారు.
అయితే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ అంథోని ఫోసి మాత్రం ఈ వ్యాక్సిన్ తయారీకి ఏడాది లేదా 18నెలల సమయం పట్టవచ్చని తెలిపారు.