అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లిక్ పార్టీ తరఫున ఉద్ధృత ప్రచారం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆదరణ - వ్యతిరేకత కూడా ఒకే స్థాయిలో అందుకుంటున్నారు. ముఖ్యంగా ముస్లింలు - భారతీయులకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. అమెరికాలోనే కాదు విదేశాల్లోనూ ఆయనకు వ్యతిరేకతంగా నిరసనలు జరుగుతున్నాయి. రీసెంటుగా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో మహిళలు నగ్నంగా నిరసన తెలిపారు. భారత్ లోని కోల్ కతా నుంచి ఓ టీ కంపెనీ అయితే ఏకంగా ట్రంప్ శరీరంలోని దుష్టత్వం పోవాలంటూ ఆయనకు మంచి ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ గ్రీన్ టీని పెద్ద మొత్తంలో పంపించింది.
ఇలాంటి తరుణంలో ట్రంప్ తన పట్ల వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికో ఏమో కానీ కొత్త సెంటిమెంటు ప్రయోగించే ప్రయత్నం చేశారు. తన భార్యను రంగంలోకి దించారు. ఇంతవరకు పెద్దగా ఎంటర్ కాని ఆమె ఇప్పుడు తన భర్త డొనాల్డ్ ట్రంప్ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ట్రంప్ భార్య మెలానియా ఇలా అధ్యక్ష పదవికి ఎన్నికలు దగ్గరవుతున్న వేళ - వివిధ ర్యాలీల్లో పాల్గొంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
తన భర్త చాలా మృదుస్వభావి అని, ప్రజలు అనుకుంటున్న కంటే కూడా ఆయన చాలా మంచివారని పొగిడేస్తున్నారు. ఆయన కఠినాత్ముడని చాలామంది అనుకోవచ్చు కానీ... ఆయనలో జాలి - దయ - కరుణ చాలా ఎక్కువని చెబుతున్నారు.
అంతేకాదు... ఆ జాలి - కరుణ చూసే తాను ఆయన ప్రేమలో పడ్డానని మెలానియా చెబుతున్నారు. తన భర్త చాలా మంచి వ్యక్తని, అమెరికా అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకుంటే, దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, ఉగ్రవాద సమస్యను రూపుమాపగల సత్తా ఉన్న వ్యక్తని అభివర్ణించారు. క్లేవ్ ల్యాండ్ లో జరిగిన ప్రచారంలో ఆమె ఇలా తన భర్తను పొగిడేస్తుండడంతో ట్రంప్ ప్రత్యర్థులు కూడా దానిపై స్పందిస్తున్నారు. తన పట్ల వస్తున్న వ్యతిరేకితను తగ్గించుకోవడానికి ట్రంప్ ఇలా భార్యను జనం ముందుకు తీసుకొచ్చి సెంటిమెంటు పండిస్తున్నారని అంటున్నారు.