3 నెలలు అద్దె అడగొద్దు.. కలెక్టర్ ఆదేశాలు

Update: 2020-04-19 09:49 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గుంటూరు - కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో ఆయా నగరాల్లో రెడ్ జోన్ లుగా ప్రకటించారు. ఎవరినీ ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా కట్టడి చేశారు. కూరగాయలు - నిత్యావసరాలను కూడా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.

రెడ్ జోన్ పరిధిలో మరో నిబంధన తీసుకొచ్చారు. గుంటూరు జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల్లో ఏ ఒక్క ఇంటి యజమాని మూడు నెలలపాటు అద్దె వసూలు చేయరాదంటూ గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిపై విపత్తుల నిర్వహణ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక రెడ్ జోన్లలో నివాసం ఉంటున్న వారిని ఆదుకునేందుకు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1000 నగదు సాయం కూడా ముందుగా రెడ్ జోన్లలో నివాసం ఉంటున్న వారికే ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News