దేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన భాగ్యనగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి డబుల్ డెక్కర్ బస్సు ఒకటి. దాదాపు 16 సంవత్సరాల క్రితం వరకు ఈ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టాయి.
సికింద్రాబాద్ - మెహదీపట్నం, సికింద్రాబాద్- జూపార్కు, సికింద్రాబాద్-సనత్ నగర్, చార్మినార్ మార్గాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. ఈ బస్సులోని అప్పర్ డెక్ లో కూర్చొని ప్రయాణిస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉండేది. ఆకాశంలోంచి కింద నడిచే వాహనాలను చూస్తున్నట్టుగా అనుభూతి చెందేవారు ప్రయాణికులు.
అయితే.. రానురానూ వీటి నిర్వహణ వ్యవయం ఎక్కువవుతోందని పక్కన పెట్టింది ఆర్టీసీ. మళ్లీ ఇన్నాళ్లకు వీటిని రోడ్లపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేయాలని ఓ సిటిజన్ ట్విట్టర్ లో కేటీఆర్ ను కోరాడు. దీంతో స్పందించిన మంత్రి.. ఈ అంశాన్ని పరిశీలించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
వెంటనే స్పందించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు ఆహ్వానించడం విశేషం. దీనికి స్పందించిన ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ టెండర్లు దాఖలు చేసింది. తొలి దశలో 25 బస్సులను అందించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. ఈ ప్రతిపాదనకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలపిన వెంటనే డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగర వీధుల్లో పరుగులు పెట్టనున్నాయి.