వైద్యో నారాయణో హరి అని నానుడి. ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం. అంతా రెండు చేతులు జోడించి దండం పెట్టేది.. దేవుడి తర్వాత వైద్యుడికే. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ఒక వైద్యుడు మహిళా రోగితో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వైద్యం పేరుతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను తాకడం చేశాడు. ఇలా పలుమార్లు చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో ఆ కీచక వైద్యుడికి పదేళ్ల జైలుశిక్ష పడింది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ వైద్యం కోసం 2016 సెప్టెంబర్ లో సికింద్రాబాద్‌లోని భాస్కర్ చెస్ట్ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్ విజయ్ భాస్కర్ వైద్యం పేరుతో మహిళ ఛాతీపై చేతులతో తడిమాడు.
అంతేకాకుండా ఆ తర్వాత ఆమె ప్రైవేట్ భాగాలను తాకి ఇబ్బంది పెట్టాడు. అనుమానం వచ్చిన బాధితురాలు ప్రశ్నించగా.. ఇదంతా చిక్సితలో భాగంగానే చేసినట్టు వైద్యుడు విజయ్ భాస్కర్ బుకాయించాడు.
కాగా, మరోమారు అదే హాస్పిటల్ కు వెళ్లిన బాధితురాలితో మరోసారి వైద్యుడు విజయ్ భాస్కర్ అదే తరహాలో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తీవ్ర ఆవేదనకు గురయిన బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయింది. ఆ తర్వాత మరోమారు ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఓ యువతి కీచక వైద్యుడు విజయ్ భాస్కర్ తో గొడవ పడటం చూసింది.
విషయం ఏంటని ఆరా తీయగా సదరు యువతితోనూ తనతోనే ప్రవర్తించినట్టే అసభ్యంగా ప్రవర్తించాడని తెలుసుకుంది. దీంతో ధైర్యం తెచ్చుకుని వైద్యుడిపై తన భర్తకు చెప్పింది. అంతేకాకుండా 2016, అక్టోబర్ 8న బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విజయ్ భాస్కర్ ను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత విజయ్ భాస్కర్ బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే, గోపాలపురం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయస్థానం విజయ్ భాస్కర్ ను దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ. 5వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. కాగా, 2016లోనే గోపాలపురం పోలీస్ స్టేషన్లోనే విజయ్ భాస్కర్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉందని తెలుస్తోంది.