మార్చి 31న చనిపోతే - ఏప్రిల్ 3 న అనౌన్స్ చేయడం వెనుక మర్మమేమిటి?

Update: 2020-04-03 12:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో తోలి కరోనా మరణం నమోదైంది. అయితే , ఈ మృతి ఈ రోజు జరగలేదు. మర్చి 30 న జరిగింది. విజయవాడకు చెందిన షేక్ సుభాని మార్చి 30న విజయవాడలోని జనరల్ ఆస్పత్రిలో చేరాడు. అయితే , అతడు హాస్పిటల్ లో చేరిన కేవలం ఒక గంటకే శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు. ఆయనకి డయాబెటీస్ - హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసింది. మరుసటి రోజు కరోనా టెస్ట్ నివేదికలో.. అతడికి కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఇకపోతే షేక్ సుభానీ తనయుడు గత నెల 17వ తేదీన ఢిల్లీ నుంచి వచ్చినట్లు గుర్తించి - అతడికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా ..అతడికి మార్చి 31 న కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీనితో అతని నుండి అతని తండ్రికి కరోనా సోకి ఉండచ్చు అని వైద్యులు చెప్తున్నారు. వీరు విజయవాడ శివారులో ఉన్న కుమ్మరపాలెంకు చెందినవారు. వీరికి కరోనా పాజిటివ్ అని తేలడం తో వీరితో కాంటాక్ట్ పెట్టుకున్న 29 మందిని గుర్తించి ..వారందరిని క్వారంటైన్ కి పంపించారు. అలాగే మృతుడి తనయుడు ఢిల్లీ నుండి విమానం లో రావడం తో ఆ విమానం యొక్క వివరాలు కేంద్రానికి అందించినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అయితే, అతడు కరోనాతోనే చనిపోయాడా? లేక ఇతర సమస్యల వల్ల చనిపోయాాడా? అన్న సందేహం తో జాప్యం జరిగింది. తాజాగా.. కరోనా వైరస్ వల్లే అతడు చనిపోయాడని - ఇదే ఏపీలో తొలి కరోనా మరణం అని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే , అతడు మార్చి 30 న చనిపోయాడు , కరోనాతో చనిపోయాడు అని మరుసటి రోజు రిపోర్ట్ వస్తే ..ఆ విషయాన్ని ప్రకటించడానికి ప్రభుత్వం ఎందుకింత టైమ్ తీసుకుంది అని, కరోనా తో చనిపోయారు అని నిర్దారణ జరిగిన తరువాత కూడా అందులో జాప్యం దేనికి అంటూ సోషల్ మీడియా లో పలువురు చర్చిస్తున్నారు. అలాగే కరోనా అలజడి రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో హెల్త్ డిపార్ట్ మెంట్ ఎందుకు కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News