మీరు తమిళనాడుకు వెళ్లాలనుకుంటున్నారు. వెళ్లే ఉద్దేశం ఉందా? ఆ రాష్ట్రంలో గుళ్లు.. గోపురాల్ని సందర్శించాలన్న ఆలోచన ఉందా? అయితే.. ఇది తప్పక చదవాల్సిందే. లేదంటే.. ఇబ్బందులు తప్పవంతే. మరో ఆరు రోజుల్లో రానున్న కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి తమిళనాడులోని గుళ్లల్లోకి భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆ రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని దేవాలయాల్లోకి వెళ్లే భక్తులంతా తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ కు సంబంధించిన స్పష్టమైన అధికారిక ఉత్తర్వుల్ని ఆ రాష్ట్ర సర్కారు జారీ చేసింది. ఆలయాలకు వెళ్లే పురుషులు.. జీన్స్.. టీ షర్ట్స్ లాంటివి వేసుకుంటే గుళ్లల్లోకి అనుమతించరు. అదే విధంగా మహిళలకు సంబంధించి ఇలాంటి నిబంధనే ఉంది.
తాజా రూల్ ప్రకారం పురుషులు.. పంచె.. పైజమా.. పైన కండువా వేసుకోవాలి. అదే విధంగా మహిళలు చీరలు.. పరికిణీ ఓణీలు.. చున్నీ సహా ఉన్న పంజాబీ డ్రెస్ లు మాత్రమే ధరించాలి. చిన్న పిల్లలు దేహమంతా కప్పుకునేలా ఉన్న ఎలాంటి దుస్తుల్ని ధరించాల్సి ఉంటుంది. దేహాన్ని కప్పేసినట్లు ఉండే లెగ్గింగ్స్.. జీన్స్ లాంటి ఆధునిక వస్త్రధారణ ఉన్న వారిని గుళ్లల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేస్తున్నారు. సో.. తమిళనాడులోని దేవాలయాలకు ప్లాన్ చేసుకుంటే మాత్రం జర జాగ్రత్తగా ఉండటం మర్చిపోకండి సుమా.