ఇప్పటి వరకూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎలా బుక్ చేశారు? ఎవరైనా తాగి వాహనం నడిపితే.. అది కూడా మోతాకు మించి ఉంటే కేసు నమోదు చేశారు. దీనికోసం బ్రీథింగ్ ఎనలైజర్ ను కూడా ఉపయోగించారు. తాగిన మద్యంలో ముప్పై శాతానికి మంచినట్టు రిపోర్టు చూపిస్తే.. బండి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టేసేవాళ్లు. ఆ తర్వాత కోర్టులో ఫైన్ కట్టి తెచ్చుకునేవాళ్లు.
కానీ.. ఇప్పుడు రూల్ మారింది. ఈ కొత్త విధానం వల్ల మందుబాబుల ఆటలు సాగవు అంటున్నారు పోలీసులు. ఇప్పటి వరకూ మందు తాగినవారు కారు స్టీరింగ్, బైక్ హ్యాండిల్ పట్టుకుంటే నేరంగా పరిగణించారు. ఇక మీదట మాత్రం.. మందు తాగిన వ్యక్తి వాహనం నడుపుతుంటే.. వెనకాల కూర్చున్నాకూడా నేరమేనట!
అవును.. ఈ మేరకు కొత్త కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇదెక్కడి న్యాయమని అడగడానికి లేదు. ఇకవేళ అడిగారనుకో.. మోటార్ వాహన చట్టంలోని 188వ సెక్షన్ చూపిస్తారు. దీని ప్రకారం.. మద్యం తాగారని తెలిసి కూడా వారి వాహనంలో ప్రయాణించడం నేరం అనే వాక్యాలు కనిపిస్తాయి. ఇది కేవలం ద్విచక్రవాహనానికే అనుకునేరు.. అన్ని వాహనాలకూ వర్తిస్తుంది. సో.. మద్యం తాగి వాహనం నడమే నేరం కాదు.. తాగినడిపే వాళ్ల వాహనం ఎక్కడం కూడా నేరమే అన్నమాట. ఇది మైండ్లో పెట్టుకొని మందేయండి.. బండెక్కండి సరేనా!