బతికున్నంత కాలం గ్యాంగస్టర్ గా.. పేరు మోసిన నేరస్తుడిగా మాత్రమే అభివర్ణిస్తూ.. వార్తలు ఇచ్చిన మీడియా.. తాజాగా నయిం ఎన్ కౌంటర్ అనంతరం మాత్రం ‘నర హంతక’ హోదా ఇచ్చేసి వార్తలు ఇస్తున్న వైనం తెలిసిందే. గడిచిన రెండు.. మూడు రోజులుగా నయిం మీద వస్తున్న వార్తల్ని చూస్తే.. కలిగే మొదటి సందేహం ఏమిటంటే.. ఇంత దుర్మార్గుడు.. కిరాతకుడైన హంతకుడ్ని ఇంతకాలం ఎందుకు వదిలినట్లు? అని.
ఇదిలా ఉంటే.. తాజాగా నయింను రాజకీయ నేతలతో ముడిపెడుతూ ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడే కార్యక్రమం ఒకటి మొదలైంది. దీనికి.. అంచనాలు.. పద్దుల కమిటీ ఛైర్మన్.. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెర తీశారు. నరహంతకుడైన నయింను పెంచి పోషించింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఆయన అభివర్ణించారు. ప్రజా కళాకారుల్ని.. ప్రజా సంఘాల నేతల్ని.. పౌరహక్కుల నేతల్ని పొట్టన బెట్టుకునేందుకు వీలుగా నయింను చంద్రబాబు పెంచి పోషించినట్లుగా ఆయన ఆరోపించారు.
బాబు అండదండలతోనే నయిం గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎదిగాడని.. నక్సలైట్లను అంతం చేయటానికి నయిం తరహా బ్లాక్ కోబ్రాలను పెంచినట్లుగా విమర్శించారు. 2004.. 2008లతో తనను నయిం బెదిరించిన మాట వాస్తవమని చెప్పిన ఆయన నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘2008లో మా స్వగ్రామం చిట్టాపూర్ కు నయిం.. అతని అనుచరులు వచ్చారు. నన్ను చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. అప్పట్లో సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తాను 20 ఏళ్ల కిందటే గిరాయిపల్లి ఎన్ కౌంటర్ లో తాను చనిపోవాల్సిదని.. ఆ రోజు అదృష్టం బాగుండి బతికిపోయానని చెప్పిన ఆయన.. ‘‘ఇప్పుడీ జీవితం.. ఎమ్మెల్యే పదవి బోనస్ లాంటిది. నాకు ప్రాణాల మీద తీపి.. డబ్బు మీద ఆశ లేదు. నయిం లాంటి హంతకులు హెచ్చరికలు నా వెంట్రుకతో సమానం. అందుకే.. ఇప్పటికి గన్ మెన్స్ లేకుండానే ప్రజల్లో తిరుగుతున్నా’’ అని చెప్పారు.
తనకు గన్ మెన్లు వద్దని చెప్పినా.. ముంత్రి హరీశ్ రావు వినతి మేరకు ఒక్క గన్ మెన్ ను పెట్టుకున్నట్లు చెప్పిన రామలింగారెడ్డి.. దబ్బాక ప్రజలే తనకు రక్షణ కవచాలుగా చెప్పుకొన్నారు. 20 ఏళ్ల కిందట నయిం నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని.. అప్పటి నాయకులు.. అధికారులు నయిం చేతుల్లో కీలుబొమ్మలుగా మారినట్లుగా ఆయన చెప్పారు. తాజాగా నయిం పీడ విరగడై ప్రజలు సంతోషంగా ఉండటమే కాదు.. ఈ ఘటనతో పోలీసులపై నమ్మకం పెరిగిందని చెప్పారు.