దుశ్యంత్.. అనామకుడు.. కింగ్ మేకర్ ఎలా అయ్యాడు?

Update: 2019-10-26 07:12 GMT
హర్యానాలో మరో కుమారస్వామి అయిపోయాడు జననాయక జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షుడు దుశ్యంత్ చౌతాలా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడు. ఇప్పుడు హంగ్ వచ్చిన హర్యానా అసెంబ్లీలో కింగ్ మేకర్ అయ్యాడు. రక్తసంబంధం అని కూడా చూడకుండా పార్టీని గెంటేసిన తన చిన్నాన్నకు తగిన బుద్ది చెప్పాడు. ఏకంగా హర్యానా  ఎన్నికల్లో దుశ్యంత్ ను బహిష్కరించిన పార్టీ అడ్రస్ గల్లంతు చేసి హీరో అయిపోయాడు. ఇప్పుడు బీజేపీ సంకీర్ణ సర్కారులో ఏకంగా 10 సీట్లు మాత్రమే సాధించిన దుశ్యంత్ ఉప ముఖ్యమంత్రి కావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

దుశ్యంత్ చౌతాలా.. కేవలం 30 ఏళ్ల వయసున్న నవ యువ రాజకీయనాయకుడు. ఇప్పుడు ఈయన కోసం మోడీ, అమిత్ షా, సోనియా లాంటి వాళ్లే క్యూ కట్టాల్సిన పరిస్థితిని హర్యానాలో తీసుకొచ్చాడు. హంగ్ వచ్చిన హర్యానా అసెంబ్లీలో 10 సీట్లతో కింగ్ మేకర్ అయ్యాడు. నాడు బచ్చా అంటూ ఎగతాలి చేసి  గెంటేసిన పార్టీనేతలకే ఇప్పుడు అడ్రస్ లేకుండా చేశాడు.

దుశ్యంత్ చౌతాలా.. హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా మనవడు. చౌతాలా ఫ్యామిలీకి హర్యానాలో మంచి పేరు, శక్తివంతమైన రాజకీయ నేపథ్యం ఉంది. అమెరికాలో లా పూర్తి చేసిన దుశ్యంత్ 26 ఏళ్లకే 2014 ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలిచాడు. 16వ పార్లమెంట్ లో అతిపిన్న వయస్కుడిగా పేరుసంపాదించాడు.

చౌతాలా కుటుంబం అంతకుముందు ఐఎన్ఎల్డీ పార్టీలో ఉండేవారు. దుశ్యంత్ తండ్రికి, చిన్నాన్నకు పడలేదు.  వీరి రాజకీయ పోరు ఐఎన్ఎల్డీ పార్టీలో పతాక స్థాయికి చేరింది. దీంతో దీంతో దుశ్యంత్ చౌతాలా తండ్రిని, వీరి ఫ్యామిలీని ఐఎన్ఎల్డీ పార్టీ నుంచి బహిష్కరించారు. కసి, పగతో పార్టీనుంచి బయటకు వచ్చిన దుశ్యంత్ కేవలం 10నెలల క్రితమే జననాయక జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 10 సీట్లు సాధించి కింగ్ మేకర్ అయ్యాడు.

ఇక ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో దుశ్యంత్ ను గెంటేసిన ఐఎన్ఎల్డీ పార్టీ బొక్కబోర్లా పడింది. ఐఎన్ఎల్డీ చీఫ్ అయిన దుశ్యంత్ చిన్నాన్న అభయ్ చౌతాలా కేవలం ఒకే ఒక్క సీటు సాధించి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 2014లో 20 సీట్లు సాధించిన ఐఎన్ఎల్డీ ఈసారి దుశ్యంత్ దెబ్బకు కేవలం ఒకే సీటుకు పరిమితమై ఘోర ఓటమిని కొనితెచ్చుకుంది. ఐఎన్ఎల్డీ నుంచి గెంటేసిన తర్వాత జేజేపీని పెట్టిన దుశ్యంత్ ను చూసి ఆయన చిన్నాన్న అభయ్ చౌతాలా, ఆ పార్టీ నేతలు బచ్చా అంటూ విమర్శించినా.. ఎద్దేవా చేసినా యువతను, ప్రజలను ఏకం చేసి దుశ్యంత్ సాధించిన ఈ విజయం అద్వితీయం.. దుశ్యంత్ దెబ్బకు ఇప్పుడు ఐఎన్ఎల్డీ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది.. దాయాదుల కలహాలతో విడిపోయిన ఐఎన్ఎల్డీ నుంచి హర్యానా రాజకీయ తెరపై కొత్త నాయకుడిని పుట్టుకొచ్చేలా చేసింది.
Tags:    

Similar News