శ్రీకాకుళం జిల్లా టెక్కలి సీటు అంటే చాలా ఫ్యామస్. ఎన్టీయార్ లాంటి రాజకీయ ధీరుడు అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఈ సీట్లో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలూ సమానంగా పట్టు కలిగి ఉన్నాయి. టెక్కలి రాజకీయం ఒక లెక్కలో ఉంటుంది. అలాంటి టెక్కలిని తన స్థావరంగా చేసుకుని హరిశ్చంద్రపురం నుంచి షిఫ్ట్ అయ్యారు కింజరాపు అచ్చెన్నాయుడు. 2009 లో నియోజకవర్గాల పునర్ విభజన తరువాత ఈ రాజకీయ పరిణామం సంభవించింది.
అయితే ఇక్కడ కాళింగ సామాజిక వర్గం ఎక్కువ. వారికి చాలా కాలం టెక్కలి సొంత సీటుగా ఉండేది. పైగా సామాజికవర్గ ఆధిపత్య పోరు కూడా తోడు అవుతోంది. దాంతో వెలమ సామాజికవర్గానికి చెందిన అచ్చెన్నాయుడు మీద అటు రాజకీయంగా ఇటు సామాజికంగా కూడా పోరు సాగిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈయన ఫైర్ బ్రాండ్లకే ఫైర్ బ్రాండ్. ఆయన మాటలే నిప్పులుగా మండుతాయి. ఎవరినీ అసలు పట్టించుకోరు.
ఎవరైనా తనకేంటి అని కూడా అంటారు. అలాంటి దువ్వాడ కాంగ్రెస్ లో 2006లోనే జెడ్పీటీసీగా నెగ్గి కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కాలేకపోయారు. అక్కడ వర్గపోరుతో పాటు, కుల రాజకీయాలు కూడా ఆయన్ని ఆయన్ని అలా ఉంచేశాయి. ఇక లాభం లేదనుకుని 2009 వేళ ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి కూడా ఎమ్మెల్యే గా పోటీ చేసి లక్ ని టెస్ట్ చేసుకున్నారు. అయినా సీన్ మారలేదు. 2014లో వైసీపీ నుంచి టెక్కలిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు దక్కలేదు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ పడినా జూనియర్ ఎర్రన్నాయుడు గెలిచారు.
దాంతో దువ్వాడ శ్రీనివాస్ కు చట్టసభల భాగ్యం ఉండదా అని అభిమానులు కలవరపడుతున్న వేళ జగన్ ఆయన మీద దయతలచి ఎమ్మెల్సీని చేశారు. ఆ పదవితో ఆయన టెక్కలిలో అనధికార ఎమ్మెల్యేగా హవా చలాయిస్తున్నారు. టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుని ఆయన అలా సవాల్ చేస్తూ వస్తున్నారు.
ఆయనకు కింజరాపు ఫ్యామిలీ మీద రాజకీయ యుద్ధానికే సమయం అంతా సరిపోతోంది. ఈ క్రమంలో దువ్వాడ లేటెస్ట్ గా హాట్ హాట్ కామెంట్స్ అచ్చెన్నాయుడు మీద చేశారు. జగన్ సార్ జస్ట్ అనుమతి ఇస్తే చాలు తాను అత్మాహుతిదళంగా మారిపోతాను అని అచ్చెన్నాయుడు విషయంలో ఎంతకైనా తెగిస్తాను అని చాలా కామెంట్స్ చేశారు.
ఇక అచ్చెన్నాయుడుని ఆహుతి సినిమాలో విలన్ రామిరెడ్డి మాదిరిగా నడివీధుల్లో తిప్పి తాట తీస్తాను అని కూడా దువ్వాడ దూకుడులో అనేశారు. ఇలా చాలా అనుచిత కామెంట్స్ ఆయన చేయడంతో తెలుగుదేశం అక్కడ ఒక్కసారిగా భగ్గుమంది, అచ్చం ఉగ్రవాది మాదిరిగా అచ్చెన్నాయుడు మీద కామెంట్స్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటారా లేదా అంటూ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
దువ్వాడ మీద యాక్షన్ తీసుకోకపోతే ఊరుకునేది లేదని, తాము ఆందోళనలు చేస్తామని టెక్కలి టీడీపీ హెచ్చరిస్తోంది. మొత్తానికి దువ్వాడ తమ మాటలతో ఏం సాధించారు అంటే నాలుగు అని మరో నాలుగు తినడమే అంటున్నారు. నిజానికి దువ్వాడ చేతికే టెక్కలి నియోజకవర్గాన్ని జగన్ అప్పగించారు. ఎమ్మెల్సీ పదవి కూడా ఉంది. అధికార హోదా ప్రోటోకాల్ అన్నీ ఉన్నాయి.
మరి ఇన్ని ఉంచుకుని టెక్కలిలో వచ్చే ఎన్నికలో అచ్చెన్నాయుడు మీద గెలిచే వ్యూహాన్ని రూపొందించకుండా ఊరకే నోరు పారేసుకుంటే ఎలా దువ్వాడా అని అంటున్నారు అంతా. అదే టైమ్ లో దువ్వాడకు సొంత పార్టీలో నేతలతో కూడా అంత సయోధ్య లేదు అంటున్నారు. అక్కడ ఉన్న కాళింగ కార్పోరేషన్ చైర్మన్ పేడాడ తిలక్ తో పడదు, ఆయన వర్గం వేరు, అలాగే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణితో కూడా విభేదాలు ఉన్నాయని అంటున్నారు.
ఇలా సొంత పార్టీని చక్కదిద్దుకోకుండా అచ్చెన్నాయుడిని ఓడిస్తాను ఆయన్ని ఏదో చేస్తాను అని దువ్వాడ ఎంతలా అరచి గీ పెట్టినా ఉపయోగం ఏంటన్నది సొంత పార్టీతో పాటు బయట పార్టీల వారి మాటగా ఉంది. అయినా దువ్వాడ ఎక్కడా తగ్గను అనే అంటున్నారు.