ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జరుగుతాయని కొందరు.. అబ్బే అలాంటి దేమీ లేదని.. మరికొందరు చెబుతున్నారు. అయితే.. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్న లాజిక్ కూడా ఆయనచెప్పారు. ఏపీలో ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఆయన తేల్చి చెబుతున్నారు. మరి ఆయన లాజిక్ కూడా నిజమేనని అనిపిస్తోంది. అయితే.. ముందస్తు ఉంటుందా? ఉండదా? అంటే.. మళ్లీ ప్రశ్నే!
అయినా.. రఘురామ లాజిక్ ఏంటో ఒక సారి చూస్తే పోలా.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నది ఎంపీ రఘురామ ఉద్దేశం. ఎలాగంటే.. కర్ణాటక లేదా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఏపీలోనూ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలకు మధ్యలో కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే జరగొచ్చన్నారు.
వాస్తవానికి 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. కానీ, రఘురామ అంచనా ఏంటంటే.. అలా జరిగే అవకాశం లేదని! ఎన్నికలకు వంద రోజులే సమయమని చెబుతున్న ప్పటికీ.. వ్యూహం మాత్రం 50 - 60 రోజులకే పరిమితం చేసుకున్న వైనాన్ని రఘురామ స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుల కోసం కొంత నగదు ఇవ్వాలని ఎమ్మెల్యేలను జగన్ కోరినట్లు తెలిసిందన్నారు.
ఎన్నికలకు ఎంత ఖర్చైనా మిగిలిన మొత్తం తానే భరిస్తానని వారికి హామీ ఇస్తున్నట్లు సమాచారం ఉందని రఘురామ చెబుతున్నారు. అయితే జగన్ అడిగిన మొత్తం చెల్లించడానికి వారు సుముఖంగా లేనట్లు తెలిసిందన్నారు. తమ పార్టీ పెద్దలు మూటలు సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవు తున్నారని చెప్పారు. ఏదేమైనా.. వచ్చే మార్చి తర్వాత..ఏపీలో సంచలనాలు చోటు చేసుకోవడం మాత్రం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.