ఆ మధ్యన బోరబండ.. ఆ తర్వాత షేక్ పేట.. ఇలా కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకోవటం.. అక్కడి స్థానికులు భయాందోళనలకు గురి కావటం తెలిసిందే. అయితే.. అదంతా భారీ వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరు భూమి లోపలకు ఇంకే సమయంలో చోటు చేసుకునే సర్దుబాటు కారణంగా చిన్న చిన్న ప్రకంపనలు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కూకట్ పల్లి ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకోవటం సంచలనంగా మారింది.
కూకట్ పల్లిలోని స్థానిక అస్బెస్టాస్ కాలనీలో ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర.. పది గంటల సమయంలో రెండు.. మూడు సెకన్ల పాటు పెద్ద శబ్దంతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో భూమి లోపల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లుగా చెబుతున్నారు.
తాజాగా చోటు చేసుకున్న ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శబ్దాలు విన్నంతనే పరుగు.. పరుగున ఇళ్లల్లో నుంచి పరుగులు తీస్తూ బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో వర్షాలేమీ పడలేదు. ఇలాంటి సమయంలో చోటు చేసుకున్న భూ ప్రకంపనలకు కారణం ఏమిటన్న విషయంపై శాస్త్రవేత్తలు ఏమని చెబుతారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.