తన తండ్రి పుట్టిన రోజున హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రకటించిన పార్టీ పేరును షర్మిల మార్చాల్సిన పరిస్థితి వచ్చిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పార్టీ పేరు మార్చక తప్పదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
దీనికి కారణం.. షర్మిల తన పార్టీని ప్రకటించటానికి ముందే.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇదే పేరుతో మరొకరు పార్టీ పేరునురిజిస్టర్ చేసుకోవటమే కారణం. వైఎస్సార్టీపీగా షురూ చేసిన షర్మిలకు.. అంతకు ముందే అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును పోలి ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీన్ని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ను నిలిపినట్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న పేరుతో కాకుండా.. మరో పేరును ప్రతిపాదించాలని షర్మిలను ఈసీ కోరింది. దీంతో.. ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే.. షర్మిల తాను పెట్టిన పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్న షర్మిల.. తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకోవటం కోసం పాదయాత్రను మొదలు పెట్టటం తెలిసిందే.
అయితే.. కొవిడ్ కారణంగా తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు షర్మిల. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో ఎదురైన ఇబ్బంది నేపథ్యంలో.. ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నగా మారింది. అయితే.. షర్మిల ముందు రెండు దారులే ఉన్నాయని అంటున్నారు.
అందులో ఒకటి న్యాయపోరాటం చేయటం ఒకటైతే.. రెండోది ఇప్పుడు అభ్యంతరం చేస్తున్న వారితో రాజీ చేసుకొని.. ఆ పేరును తాను తీసుకోవటం లాంటిది చేయాలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పార్టీ పేరును మార్చే కన్నా.. తన తండ్రి పేరు మీద పార్టీని కొనసాగించాలని కోరుకోవటం ఖాయం. ఏపీలో తన సోదరుడికి సైతం ఇదే పరిస్థితి ఎదురుకావటం.. దాన్ని తనకు తగ్గట్లుగా మార్చుకున్న నేపథ్యంలో.. షర్మిల అదే ఫార్ములాను ఫాలో అవుతారా? లేదా? అన్నది కాలమే బదులివ్వాల్సి ఉంటుంది.