అభినందన్ ఫొటో.. బీజేపీ ఎమ్మెల్యేకు ఈసీ నోటీస్

Update: 2019-03-13 10:03 GMT
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వ పథకాలే కాదు.. శంకుస్థాపనలు అన్నీ బంద్. యుద్ధమేఘాలు మొన్నటి వరకూ కమ్ముకోవడంతో దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీలులేదు. భారత సైన్యాన్ని ఇన్ వాల్వ్ చేయవద్దు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు పొందుపర్చింది. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించింది.

అయితే ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం చూపించాడు. ఢిల్లీలోని విశ్వాస్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ ఈనెల 1న అభినందన్ ఫొటోతోపాటు ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో రెండు పోస్టర్లను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఆదివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా ఆ పోస్టును తీయలేదు ఎమ్మెల్యే. దేశం కోసం ఎంతో ధైర్యసాహసాలతో క్రేజ్ తెచ్చుకున్న అభినందన్ ను ఇలా రాజకీయంగా వాడుకోవడంపై ఈసీ సీరియస్ అయ్యింది.

వెంటనే అభినందన్ ఫొటోను తీసివేయాలని బీజేపీ ఎమ్మెల్యేను ఈసీ ఆదేశించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ సైన్యం గురించి..సైన్యంలోని వ్యక్తులను రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దని ఈసీ స్పష్టం చేసింది. అలాగే ఫేస్ బుక్ సహా సోషల్ మీడియా దిగ్గజ సంస్థలకు ఇలాంటి పోస్టులు తీసేయాలని ఆదేశాలిచ్చింది. లేకపోతే ఎన్నికల కోడ్ నిబంధనల కింద చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.
    

Tags:    

Similar News