ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఎన్నికల సంఘం చేస్తున్న తప్పిదాలు అన్ని ఇన్నీ కావు. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు అవ్వడంతో పాటు, ఎన్నో పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఓట్లు గల్లంతు అయిన వారు మొత్తుకుంటున్నా కూడా ఎన్నికల కమీషన్ మాత్రం పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుంది. అయితే తన ఓటు గల్లంతయ్యిందని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, స్పెషల్ పర్మీషన్ తో ఓటు వేసిన తమిళ హీరో శివ కార్తికేయన్ పై ప్రస్తుతం ఎన్నికల సంఘం సీరియస్ అవుతోంది.
ఓటరు జాబితాలో పేరు లేకుండా మీరు ఓటు ఎలా వేశారు, మీరు ఓటు వేసేందుకు అనుమతించిన అధికారి ఎవరు అంటూ హీరో శివ కార్తికేయన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఓటు గల్లంతు అయితే మళ్లీ ఓటు కోసం దరకాస్తు చేసుకోవాలి, అంతే తప్ప ఓటు లేకుండా ఓటు వేయడం అనేది చట్ట రీత్యా నేరం అవుతుందని, ఇందుకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఈ సందర్బంగా ఈసీ ఒక నోటీసులో పేర్కొనడం జరిగింది.
జాబితాలో పేరు లేకున్నా ఓటు వేయనిచ్చినందుకు గాను ఇప్పటికే పోలింగ్ కేంద్ర అధికారులపై యాక్షన్ కు ఈసీ సిద్దం అయ్యింది. ఓటు గల్లంతు విషయం పక్కన పెట్టి ఇప్పుడు లిస్ట్ లో పేరు లేకున్నా ఎలా ఓటు వేశారు అంటూ ఈసీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓటు వేసినందుకు మీరు ఇలా రియాక్ట్ అయితే లక్షలాది మంది తమ ఓట్లను కోల్పోయారు. వారు అంతా కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి. బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడమే కాకుండా ఒక వ్యక్తి బాద్యతగా ఓటు వేస్తే అతడిపై యాక్షన్ కు సిద్దం అవుతారా అంటూ హీరో అభిమానులు మరియు సాదారణ జనాలు కూడా ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.