ఎన్నికల సంఘం 'దూకుడు'

Update: 2015-11-02 11:26 GMT
బీహార్ ఎన్నికలు తుది దశకు చేరుతున్న వేళ ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ముఖ్యనేతలకు నోటీసులు జారీ చేసింది . గతి తప్పి మాట్లాడరంటూ వారిపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చిన్నోడు రాహుల్ గాంధీ అయితే, బీజేపీ బ్రెయిన్ అమిత్ షా - ఆర్జేడీ అదినేత లాలూలకు నోటీసులు అందాయి.

ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తి చేసి  ఐతో విడత కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల సంఘం స్పీడు పెంచింది.  ఎన్నికల నియమావళిని అతిక్రమించారంటూ  బీజేపి జాతియ అథ్యక్షుడు అమిత్ షా  - కాంగ్రేస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి - బీహర్ మాజీ సీఎం - ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు నోటిసులు జారీ చేసింది. ఇటీవల వివాదాస్పద వాఖ్యాలు చేసినందుకు గాను ముఖ్య నేతలకు శ్రీమఖాలు పంపించింది. మోడీ ని రక్త పిపాసి అన్నందుకు లాలూకు.. ఓటర్లను ప్రభావితం చేనేలా ప్రసంగం చేసిన జేడీయూ అధినేత శరద్ యాదవ్కు కూడా ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది.  వివాదాస్పద వాఖ్యాలకు నిర్ణీత గడువు లోగా వివరణ ఇవ్వాలని సంబంధిత నోటీసుల్లో  స్పష్టంచేసింది.

కాగా ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతల ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొంటున్నారు. బీహార్ లో బీజేపీ దెబ్బతినడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు అయిదో విడతపైనే పూర్తిగా దృష్టిపెట్టారు.          
Tags:    

Similar News