గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పరిణామం అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారం కైవసం చేసుకునేందుకు, బీజేపీ అధిష్టానం అనేక వ్యూహాలు పన్నినప్పటికీ...అన్నింటికీ మించి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేజారకుండా చేసి ఆ పార్టీ కూటమే గద్దెనెక్కేందుకు కారణమైంది కన్నడ ప్రజలకు డీకేఎస్ గా సుపరిచితుడైన మాజీ మంత్రి డీకే శివకుమార్. క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్ కు తరలించి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్ కు తరలించడం, మళ్లీ కర్ణాటకకు సురక్షితంగా తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఇలాంటి ట్రబుల్ షూటర్ తాజాగా ఇబ్బందుల్లో పడ్డారు.
కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ తో పాటు ఆయన అనుచరులు ఐదుగురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జనవరి 17న ఈడీ సమన్లు జారీచేసింది. ఇవి జారీ ఆయి 15 రోజులు దాటిన నేపధ్యంలో ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని సమాచారం. మంత్రితో పాటు సచిన్ నారాయణ, సునీల్ శర్మ, ఆంజనేయ, రాజేంద్రలకు నోటీసులు జారీ చేశాయి. అక్రమ నగదు బదిలీకి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ను ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ తో పాటు ఈడీ గతంలో విచారించింది. తాజాగా అరెస్టుకు సన్నద్ధం అవుతోంది.