జ‌కీర్ నాయ‌క్ ఆస్తుల‌పై ఈడీ క‌న్ను!

Update: 2019-05-03 09:15 GMT
వివాదాస్ప‌ద మ‌త ప్ర‌చార‌కుడు.. పీస్ టీవీ ముఖ్యుడు.. త‌న ప్ర‌సంగాల‌తో మ‌త విద్వేషాల్ని రెచ్చ‌గొట్ట‌టంతోపాటు.. ఉగ్ర‌వాదులతో అత‌గాడి లింకుల గురించి ఉన్న ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. పేరుకు పీస్ టీవీ న‌డుపుతున్నా.. అందులో కంటెంట్ మాత్రం పీస్ లెస్ కావ‌టం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టికే అత‌డిపై మ‌త విద్వేషాల్ని వ్యాపింప‌చేస్తున్నాడ‌న్న ఆరోప‌ణ‌ల వేళ‌.. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ దృష్టి సారించింది. ముంబ‌యిలోని ప్ర‌త్యేక కోర్టులో అత‌డిపై ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసింది. జ‌కీర్ నాయ‌క్ మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన‌ట్లుగా అధికారులు అందులో పేర్కొన్నారు.

జ‌కీర్ నాయ‌క్ వ‌ద్ద రూ.193.06 కోట్ల అక్ర‌మ ఆస్తుల్ని గుర్తించిన‌ట్లుగా ఈడీ పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌కీర్ కు చెందిన రూ.50 కోట్ల ఆస్తుల్ని జ‌ప్తు చేసిన‌ట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. జకీర్ తో పాటు మ‌రికొంద‌రిపైనా మ‌నీ లాండ‌రింగ్ కేసు న‌మోదు చేశారు. గతంలో ఒక చార్జ్ షీట్ దాఖ‌లు చేసిన ఈడీ తాజాగా మ‌రో చార్జిషీట్ ను దాఖ‌లు చేసింది. జాతీయ ద‌ర్యాప్లు సంస్థ ఎఫ్ ఐఆర్ ఆధారంగా నాయ‌క్ పై ఈడీ 2016లో కేసు న‌మోదు చేసింది. అందులో బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలో ఉగ్ర‌దాడికి ప్రేరేపించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు పొందుప‌ర్చారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. జ‌కీర్ నాయ‌క్ మెడ‌కు ఉచ్చ బిగుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News