కొన్నిసార్లు అంతే. టైం అస్సలు బాగోదు. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఇంటి పరిస్థితి కూడా అలానే ఉంది. టైం బాగోకపోవటం కాకపోతే.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. కచ్ఛితంగా శిక్ష ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైన 2జీ కొట్టేయటం ఏమిటి? అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట.. అది కూడా లక్షల్లో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో లాలూ ప్రసాద్ ను దోషిగా తేల్చటం ఏమిటి?
ఇదో షాక్ అనుకుంటే.. ఇది సరిపోనట్లే.. ఈ రోజే మరో సంచలనం చోటు చేసుకుంది. లాలూ కుమార్తె మీసా భారతిపై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఛార్జీషీట్ దాఖలు చేసింది. రూ.8వేల కోట్ల మేర మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభియోగపత్రాన్ని పటియాల హౌస్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది.
ఈ పత్రాల్ని పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసుపై జనవరి మొదటి వారంలో విచారణ జరపనున్నట్లుగా వెల్లడించింది. డొల్లకంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప్పటికే మీసా భారతి ఛార్టెడ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ ఈ ఏడాది జులైలో అనుబంధ ఛార్జీషీట్ ను దాఖలు చేశారు. తాజాగా మీసా భారతిపైనా ఛార్జీషీట్ ను దాఖలు చేశారు. తండ్రి.. కూతుళ్లు ఇద్దరిపైనా ఒకే రోజు వేర్వేరు కేసులకు సంబంధించి ఎదురుదెబ్బ తగలటం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.