ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే.
ఇటీవలే అరుణ్ రామచంద్ర పిళ్లైను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు అని పిలిచి అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో డిప్యూటీ సీఎం సిసోడియా సైతం అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు.
ఇప్పుడు కవితకు సన్నిహితుడైన అరుణ్ పిళ్లై అరెస్ట్ కావడంతో నెక్ట్స్ కవిత అన్న ప్రచారం మీడియాలో జోరుగా సాగింది. తాజాగా విచారణకు కవితను పిలవడంతో ఆమెను అరెస్ట్ చేస్తారా? అన్న ఊహాగానాలు మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.