మొన్న లిక్కర్ స్కాం.. నిన్న గ్రానైట్ కంపెనీలపై దాడులు.. ఈరోజు చీకోటి ప్రవీణ్ కేసు.. కేంద్రంలోని బీజేపీ.. టీఆర్ఎస్ ఆయువుపట్టుపై కొడుతోంది. టీఆర్ఎస్ కీలక మంత్రులను టార్గెట్ చేస్తోంది. తాజాగా తలసాని సోదరులతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, డీసీసీబీ చైర్మన్ దేవందర్ రెడ్డిలను విచారణకు పిలవడం సంచలనమైంది.
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వివాదంలో టీఆర్ఎస్ నేతలు నలిగిపోతున్నారు. వివిధ కేసుల్లో ప్రమేయమున్న వారిని కేంద్రంలోని బీజేపీ వేటాడుతోంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురిపై ఈడీ దాడులు జరుగుతుండగా.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ తో సంబంధాలున్నాయంటూ మంత్రి తలసాని సోదరుల పేర్లను బయటకు లాగింది.
తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్ లో కీరోల్ పోషిస్తున్నారు. కేసీఆర్ కు నమ్మినబంటుగా ఉన్నారు.ఆయన సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్రయాదవ్ లను తాజాగా ఈడీ అధికారులు విచారించడం సంచలనమైంది. ఇది బీజేపీ ప్రతీకార దాడిగానే టీఆర్ఎస్ భావిస్తోంది.
చీకోటి ప్రవీణ్ తో కలిసి ఈ ఇద్దరు విదేశాలకు వెళ్లి క్యాసినో ఆడినట్లుగా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. చీకోటి ప్రవీణ్ జరిపిన లావాదేవీల్లో మహేష్, ధర్మేందర్ యాదవ్ పేర్లు బయటకు రావడంతో అధికారులు పిలిచి విచారణ చేపట్టారు. హవాలా, ఫేమా ఉల్లంఘన కింద ఇద్దరినీ విచారిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో చాలా మందిని విచారణకు పిలిచారు. కానీ ఇప్పుడు తలసాని సోదరులను టార్గెట్ చేయడం సంచలనమైంది.
తెలుగు రాష్ట్రాల నుంచి పక్కదేశాలకు క్యాసినో వ్యవహారంలో తరలించిన కేసులో చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది. అతడి నుంచి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే వారిని పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందాను కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే అయితే కేసీనోలకు వెళ్లారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి ఈడీ పిలిపించి విచారించింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టారా? అన్న కోణంలోనూ విచారణ జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తలసానిని టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.