అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నారన్న ఆరోపణతోపాటు.. భారీ ఎత్తున హవాలా మార్గంలో చేతులు మారినట్లుగా గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ మహానగరానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల ఇళ్లు.. కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇందులో సైదాబాద్ కు చెందిన చికోటి ప్రవీణ్.. బోయినపల్లికి చెందిన మాధవరెడ్డి ఇళ్లతో సహా పలువురి ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమాల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఈడీ అధికారులు పెద్ద ఎత్తున చేపట్టిన సోదాలు సంచలనంగా మారాయి. ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతలతో పాటు.. అధికార నేతలతోనూ చికోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అధికార పార్టీకి చెందిన నేతలతోనూ లింకులు ఉన్నట్లుగా చెబుతారు.
ఈ నేపథ్యంలో జరిగిన సోదాలు బుధవారం అర్థరాత్రి వరకు సాగటం తెలిసిందే. ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్.. మాధవిరెడ్డిలకు చెందిన ఫోన్లను.. ల్యాప్ టాప్ ను అధికారులు సీజ్ చేశారు.
ఈడీ సోదాల నేపథ్యంలో బయటకు రాని చికోటి ప్రవీణ్.. ఈ రోజు (గురువారం)ఈడీ విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు.
తాను లీగల్ గానే వ్యాపారం చేసినట్లుగా పేర్కొన్నారు. గోవా.. నేపాల్ లో క్యాసినో లీగల్ అని.. తానో సామాన్యమైన వ్యక్తిగా పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు నిర్వహించినట్లుగా కన్ఫర్మ్ చేసిన చికోటి ప్రవీణ్.. 'వారికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకే ప్రశ్నించారు. వారి ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు చెప్పాను. వారు అడిగిన వివరాలకు వివరణ ఇచ్చాను. సోమవారం మళ్లీ విచారణకు హాజరు కావాలని చెప్పారు. హాజరవుతాను' అని వ్యాఖ్యానించారు.