ఇప్పటికే నష్టపోయి దివాళా తీసిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కొత్త కష్టమొచ్చి పడింది. యస్ బ్యాంక్ వ్యవహారంలో ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ బ్యాంక్ కేసులో తమ ముందు హాజరు కావాలని ఈ సందర్భంగా అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఎస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి అనిల్ అంబానీ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన తన రిలయన్స్ గ్రూప్ సంస్థ ఎస్ బ్యాంక్ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు తీసుకున్నారు. అవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ప్రస్తుతం ఆ రుణాలకు సంబంధించి ప్రశ్నించనున్నారు. అందులో భాగంగానే అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విచారణను తప్పించుకునేందుకు అనిల్ అంబానీ అనారోగ్యం సాకుగా చూపుతూ ఈడీకి సమాచారం అందించారంట.
పారిశ్రామిక రంగంలో జోష్ గా ఉన్న సమయంలో అనిల్ అంబానీ తన కంపెనీల్లో విభిన్న - వినూత్న చర్యలు తీసుకున్నాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేశాడు. వాటి కోసం పలు బ్యాంక్ల నుంచి అప్పులు తీసుకున్నాడు. ఎస్ బ్యాంక్ నుంచి కూడా రూ.12,800 కోట్లు రుణం పొందాడు. అయితే అనూహ్యంగా ఆయనకు వ్యాపారం కలిసిరాలేదు. ప్రస్తుతం దివాళా తీసే స్థాయికి రావడంతో ప్రస్తుతం ఆయన వద్ద చిల్లిగవ్వ లేదని తేల్చిచెప్పాడు. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ కు తిరిగి రుణం చెల్లించకపోయాడు. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. దీనికి రుణాల ఎగవేత ప్రధాన కారణంగా తెలుస్తోంది. రుణాలు ఎగ్గొట్టిన వారిలో అనిల్ అంబానీ కూడా ఉండడంతో ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అతడికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించింది. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని.. ఈ సమయంలో విచారణకు హాజరుకాలేను అని ఈడీకి అనిల్ అంబానీ సమాచారం అందించారు.