జగన్ అరెస్టు తప్పదా?

Update: 2016-02-03 09:28 GMT
 వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మరోసారి అరెస్టయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేయడంతో తదుపరి అరెస్టు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ జగన్ ను ఆదేశించింది. దీంతో విచారణకు హాజరయ్యేందుకు జగన్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. జగన్ ఆడిటర్, వైసీపీ నేత విజయసాయి రెడ్డికీ నోటీసులు అందినట్లు చెబుతున్నారు.
  
 కాగా జగన్ పై ఆర్థిక నేరాల్లో ఇప్పటికే పలు సీబీఐ కేసులున్నాయి. ఈడీ కూడా గతంలో అతని ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా మరోసారి విచారణకు రమ్మని సమన్లు జారీచేయడంతో జగన్ కూడా ఆందోళనగా ఉన్నారని సమాచారం.
   
గురువారం విచారణ అనంతరం జగన్ నుంచి ఈడీ అధికారులు అపిడవిట్లు తీసుకుంటారని.. ఆ క్రమంలో జగన్ నుంచి సహాయ నిరాకరణ ఉంటే అరెస్టు వరకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇలాంటి కేసుల్లోనే గతంలో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా అరెస్టయ్యారు. కాగా తాజా పరిణామాలతో జగన్ పార్టీలో స్తబ్దత నెలకొంది. రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా ఉన్న సమయంలో జగన్ అరెస్టయితే ఎలా అన్న చర్చ సాగుతోంది. గురువారం ఆయన ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోందో తెలియదు కాబట్టి ముందుగానే ఈ రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది.
Tags:    

Similar News