భారత్-పాకిస్తాన్.. రెండు శతృదేశాలు.. కశ్మీర్ కోసం 1947 నుంచి కొట్లాడుకుంటున్నాయి. ప్రతీ పది పదిహేను సంవత్సరాలకు ఒకసారి ఏదో రకంగా చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఐదారేళ్ల కోసారి కీచులాట జరుగుతుంటుంది. మరి ఈ రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది? ఏంత వినాశనం కలుగుతుందనే దానిపై అమెరికాకు చెందిన న్యూ బ్రూన్స్ విక్ లోని రాట్కెర్స్ యూనివర్సిటీ సంచలన అధ్యయనం వెలువరించింది.
భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగితే ఎంతలేదన్నా 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా వర్సిటీ హెచ్చరించింది. అంతేకాదు.. దాని ఫలితంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. 2025 లోపు భారత్-పాక్ ల మధ్య యుద్ధం సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఈ యుద్ధం కేవలం బాంబులు విడిచిన భారత్ పాక్ లోనే కాదని.. మొత్తం ప్రపంచానికే ప్రమాదం అని పరిశోధకుడు అలన్ రోబక్ హెచ్చరించారు. 2025 వరకు 500 వరకూ అణ్వాయుధాలు కలిగి ఉండే భారత్, పాక్ ల మధ్య యుద్ధం జరిగితే 36 మిలియన్ల టన్నుల మసి వెలువుడుతుందని.. ఇది ప్రపంచం మొత్తం విస్తరిస్తుందని వర్సిటీ పరిశోధకుడు స్పష్టం చేశారు. యుద్ధం వల్లే వచ్చే మసి బూడిద వల్ల సూర్యకిరణాలు పడక 5 డిగ్రీల వరకు ఉష్నోగ్రత తగ్గి వర్షపాతం 30శాతం వరకూ తగ్గుతుందని అధ్యయనం తేల్చింది.
ఇక కూరగాయల ఉత్పత్తి 30శాతం తగ్గి - సముద్రాల్లోనూ 15శాతం వరకూ చేపలు - ఇతర ఆహార ఉత్పత్తి పడిపోతుందని అధ్యయనం తేల్చింది. భారత్, పాక్ లే కాదు.. ప్రపంచం మొత్తం కోలుకోవాలంటే కనీసం పదేళ్లకు పైగానే సమయం పడుతుందని హెచ్చరించింది.
ప్రపంచంలోనే 9 దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయని.. భారత్ పాక్ లు మాత్రం వాటిని పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాయని.. ఇది ప్రపంచానికే ప్రమాదం అని అధ్యయనం హెచ్చరించింది.