కరోనాకు చెక్ పెట్టే శక్తి కోడిగుడ్డుకు ఉందన్న తాజా అధ్యయనం

Update: 2022-07-20 02:30 GMT
ప్రపంచానికి వణుకు పుట్టించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న అవకాశాన్ని గుర్తించే విషయంలో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇప్పటికి తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా జరిపిన అధ్యయనంలో వారు కొత్త అంశాల్ని గుర్తించారు.

తాజాగా కోడిగుడ్డుతో కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న అవకాశాల మీద ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన తాజా ఆవిష్కరణలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

కోడిగుడ్ల నుంచి సేకరించిన యాంటీబాడీలతో కొవిడ్ బాధితులకు చికిత్స చేయొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కోడిగుడ్డుతో కరోనా వ్యాధి నిరోధకంగానూ వాడే వీలుందన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.

కరోనా విషయానికి వస్తే.. మానవ కణాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇన్ ఫెక్షన్ కలిగించటానికి తన స్పైక్ ప్రోటీన్లను ఉపయోగించుకుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రోటీన్ ను లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలను కోడిగుడ్డు నుంచి తయారు చేయొచ్చన్న విషయాన్ని గుర్తించారు.

తమ అధ్యయనంలో భాగంగా కోళ్లకు కరోనా వైరస్ లోని స్పైక్ ప్రోటీన్ ఆధారంగా ఉత్పత్తి అయిన టీకాలను రెండో డోసుల మేర ఇచ్చారు. ఆ తర్వాత వాటి రక్త నమూనాలు.. గుడ్డు సొనలో యాంటీబాడీల స్థాయిని చెక్ చేశారు. ఈ కోళ్ల సీరంతో పాటు అండాల్లోనూ యాంటీబాడీలు ఉన్నట్లుగా తేల్చారు. వీటిని మనిషి శరీరంలో ఉన్న కొవిడ ను సైతం ఎదుర్కొనే సామర్థ్యం ఉందని గుర్తించారు.

తాము గుర్తించిన అంశాలతో కోడిగుడ్లతో యాంటీబాడీలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటంతో పాటు.. ఒక స్ప్రేను తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి ఆధారంగా కొవిడ్ ముప్పు పొంచి ఉన్న వారికి నివారణ సాధనంగా ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా కొవిడ్ కు చెక్ పెట్టే ప్రక్రియలో ఇదో మార్గంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News