కరోనా సమయంలో అదఃపాతాలని పడిపోయిన నాన్ వెజ్ ధరలకి మళ్లీ గత కొన్ని రోజులుగా రెక్కలొచ్చాయి. కరోనా విజృంభణ మొదలైన సమయంలో చికెన్, గుడ్డు తింటే కరోనా సోకుతుంది అని వార్తలు వైరల్ అవ్వడంతో చికెన్ , గుడ్ల వైపు తొంగిచూసే నాధుడే లేడు. దీనితో పౌల్ట్రీ రంగం భారీగా నష్టపోయింది. ఆ తరువాత చికెన్ తింటే కరోనాను ఎదుర్కొనే శక్తి వస్తుందని ,రోజూ కోడి గుడ్డు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని , రోజుకి ఎన్ని గుడ్లు తింటే అంతమంచిది అంటూ ప్రభుత్వాలు విపరీతంగా ప్రచారం చేశాయి. దీనితో గుడ్డు ధర రోజురోజుకి కొండెక్కి కూర్చుంటుంది. ప్రస్తుతం ఏపీ రిటైల్ మార్కెట్ లో కోడి గుడ్డు ధర అమాంతం 6 రూపాయలకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో 7 రూ. పలుకుతుంది.
ప్రచారంతో పాటు గుడ్ల ఉత్పత్తి సగానికి సగం పడిపోవడం కూడా ధర పెరగడానికి ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ లో రోజుకు సగటున 3 కోట్ల 65 లక్షల కోడిగుడ్లు ఉత్పత్పి అవుతాయి. కానీ , ప్రస్తుత కాలంలో కేవలం 2 కోట్ల 80 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో కోటికి పైగా గుడ్లు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అయిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో గుడ్ల లభ్యత సగానికి పైగా పడిపోయింది. లాక్ డౌన్ ప్రభావంతోనే కోడి గుడ్డు ధర పెరిగిందని వ్యాపారాలు చెప్తున్నారు. ఏప్రిల్-మే-జూన్ నెలల్లో విధించిన లాక్ డౌన్ ప్రభావం ఇప్పుడు పడిందని చెబుతున్నారు. ఆ 3 నెలల్లో రవాణా సౌకర్యం పెద్దగా లేకపోవడంతో కోళ్లకు దానా అందుబాటులోకి రాలేదు. దీంతో కోట్ల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది.లాక్ డౌన్ లో చాలామంది కోళ్ల పెంపకం పై మక్కువ చూపలేదు.
లాక్ డౌన్ లో సరైన దానా లేక ,కొన్ని కోళ్లు చనిపోగా మిగిలిన కోళ్లను కూడా వ్యాపారులు అమ్మేశారు. దీని వల్ల రోజుకు సగటున 50 నుంచి 60 లక్షల వరకు గుడ్ల ఉత్పత్తి ఆగిపోయిందని అంచనా వేస్తున్నారు. పౌల్ట్రీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. అక్టోబర్ నెలాఖరు వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈలోగా దాణా అందుబాటులోకి వచ్చి, కోళ్ల సంఖ్య పెరిగితే గుడ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో అపోహలకు పోయి ప్రజలెవ్వరూ కోడి గుడ్డు తినలేదు. అలా అప్పట్లో 4 రూపాయలకే దొరికిన గుడ్డు, 4-5 నెలలకే 7 రూపాయలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే సామాన్యులకి అతి త్వరలో గుడ్డు కూడా దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.