వైసీపీలో ర‌గులుతున్న నేత‌లు.. ఏం జ‌రిగింది?

Update: 2021-08-30 13:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అప్పుడే ముస‌లం పుట్టిందా?  పార్టీలో అంత‌ర్గ‌త ప‌రిస్థితి దారుణంగా త‌యారైం దా?  ముఖ్యంగా జిల్లాల్లో పార్టీని న‌డిపించే కార్య‌క‌ర్త‌లు పార్టీకి దూర‌మ‌వుతున్నారా? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ అంటే.. ఇది ప్ర‌జా పార్టీ అని.. ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌ను అక్కున చేర్చుకుంటామ‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌తంలో ప్ర‌క‌టించారు. ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌కు ఇదే త‌ర‌హాలో జ‌న‌స‌మీక‌ర‌ణ చేశారు. యువ‌త‌, మ‌హిళ‌లు, విద్యార్థులు ఇలా అన్ని వ‌ర్గాల వారు పార్టీకి చేరువ‌య్యారు. ఇదే పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేలా చేసింది.

ఈ రెండున్న‌రేళ్ల‌లో..

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతోంది. అయితే..ఈ  రెండున్న‌రేళ్ల‌లో పార్టీ ప‌రిస్థితి ఏంటి? అంటే.. ఒకింత ఇబ్బందుల్లోనే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. పార్టీ అధికారంలోకి వ‌స్తే..త మ‌కుఏదైనా చేస్తార‌ని.. తాము కూడా ల‌బ్ధి పొందుతామ‌ని.. ఆశించిన కార్య‌క‌ర్త‌ల‌కు అస‌లు నాయ‌కుల ద‌ర్శ‌న‌మే ల‌భించ‌డం లేదు. అంతేకాదు. నాయ‌కులే త‌మలో తాము ఆధిప‌త్య ధోర‌ణిలో ముందుకు సాగుతున్నారు. ఇక‌, నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల‌కు కూడా వ‌లంటీర్ వ్య‌వ‌స్త కార‌ణంగా డిస్టెన్స్ పెరిగిపోయింది. దీంతో కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ప‌ద‌వుల కోస‌మేనా?

ఒక‌ప్పుడు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయ‌కులు  చెప్పిన వారికి జ‌గ‌న్ ప‌ద‌వులు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఇలా కాకుండా.. ఆయ‌నే సొంత‌గా స‌ర్వేలు చేయించుకుని మంచి మార్కులు ప‌డ్డ‌వారికి మాత్ర‌మే ప‌ద‌వులు ఇస్తున్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ కోసం ప‌నిచేసినా.. వివిధ కార‌ణాల‌తో వారికి ప‌ద‌వులు ద‌క్క‌డం లేదు. పైగా ప్ర‌భుత్వం నుంచి వారికి ఎలాంటి ఆద‌ర‌ణ కూడా ల‌బించ‌డం లేదు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. జ‌న్మ‌భూమి క‌మిటీల పేరుతో పార్టీలో కీల‌కంగా ప‌నిచేసిన యువ‌త‌కు దీనిలో చోటు క‌ల్పించారు. ఇప్పుడు వైసీపీ స‌ర్కారులో ఇలాంటి ప‌థ‌కాలు లేక‌పోవ‌డం.. యువ‌త‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అంద‌రూ నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.

అన్ని జిల్లాల్లోనూ ఇంతే!

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ కేడ‌ర్ నిరాశ‌లో కూరుకుపోయింది. తాము జెండా ప‌ట్టుకుని జ‌నా ల్లో తిరిగి పార్టీ కోసం ప‌నిచేసినా.. త‌మ‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని కార్య‌క‌ర్త‌లు అంటున్నా రు. పైగా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అవ‌కాశం ఇవ్వ‌డం లేదని.. చెబుతున్నారు. దీంతో పార్టీలో నైరాశ్యం ఏర్ప‌డింది. కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే.. మంత్రులువ‌చ్చినా.. కార్య‌క‌ర్త‌లకు ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు అస‌లు ద‌ర్శ‌నం కూడా ఇవ్వ‌డం లేదు. ఇక‌, వారి స‌మ‌స్య‌లు ఎలా ప‌ట్టించుకుంటారు? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లోనూ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది.

ఇలా అయితే.. క‌ష్ట‌మేనా?

వైసీపీపై పార్టీ అధినేత జ‌గ‌న్‌కు చాలానే ఆశ‌లు ఉన్నాయి. మ‌రో 30 ఏళ్ల‌పాటు పార్టిని అధికారంలోనే ఉంచాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ``మేం పార్టీ కోసం ఎంతో ప‌నిచేశాం. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయింది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మా మొహం చూసిన నాయ‌కులు లేరు. మాతో ప‌ని ఉంటే.. మాత్రం ఫోన్లు చేస్తున్నారు. మా ప‌నిమీద ఫోన్ చేసిన ప‌ట్టించుకోవ‌డం లేదు`` అని కార్య‌క‌ర్త‌లు హ‌ర్ట్ అవుతున్నారు. ఇక‌, చిన్నా చిత‌కా ప‌నులు పొందిన వారు కూడా.. త‌మ‌కు ఎలాంటి అధికారాలు, నిధులు లేవ‌ని పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో వైసీపీ ప‌రిస్థితి రెండున్న‌రేళ్ల‌లోనే ఇబ్బందుల్లో ప‌డ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News