లింగ వివక్ష - జాతీ వివక్ష - కుల వివక్ష... వీటిపై దేనిగురించి అనాలోచితంగా మాట్లాడినా దాన్ని కచ్చితంగా మానసిక రోగ లక్షణంగానే భావించాలి. ఈ రోజుల్లో కూడా వివక్ష అనే పదాన్ని వినవలసి రావడం కచ్చితంగా సిగ్గుచేటే! ముఖ్యంగా దేశంతోనూ - ప్రాంతంతోనూ సంబందం లేకుండా చాలా మంది రాజకీయ నాయకులు విజ్ఞత మరిచి - సంస్కారం విడిచి చేసే కొన్ని వ్యాఖ్యలు సమాజంలో పెను దుమారాలనే లేపుతుంటాయి. చోటామోటా నేతల నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ వరకూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివక్ష పూరిత మాటలు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది! ఇదే క్రమంలో తాజాగా ఎల్హమి ఎజినా అనే వ్యక్తి అమ్మాయిలు కన్యలమని నిరూపించుకుంటేనే కాలేజీలకు వెళ్లాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
కాలేజీకి వెళ్లాలంటే అమ్మాయిలు ముందుగా తాము కన్యలమని నిరూపించుకోవాలంటూ ఈజిప్ట్ చట్ట సభ సభ్యుడు ఎల్హమి ఎజినా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈజిప్టులోని ఈ చట్టసభ్యుడు తరచూ మహిళలపై ఏదో ఒక మాట విసురుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన - అమ్మాయిల కన్యత్వంపై మరోసారి తన నోటికి పనిచెప్పాడు. అమ్మాయిలు యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే ముందుగా కచ్చితంగా కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని, ఆ మేరకు ఒక సర్టిఫికెట్ పొంది - కాలేజీలో ప్రవేశ సమయంలో ఆ అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని సూచించాడు. దీంతో ఆయన మూర్ఖపు వ్యాఖ్యలపై ఈజిప్టులో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఈజిప్టులో మొదలైన ఈ ఆగ్రహ జ్వాలలు ప్రపంచవ్యాప్తంగా పాకాయి. ఈయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అజీనాపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ - ఫేస్ బుక్ లో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో గతంలోనూ ఈయన ఇలాంటి దుమారం మాటలు మాట్లాడారు. ఈజిప్ట్ పురుషులు శృంగారంలో బలహీనులని, దాంతో మహిళలు తమ శృంగార వాంఛను తగ్గించుకునేలా చికిత్సలు తీసుకోవాలని గత నెలలోనే సూచించాడు. ఆ కామెంట్స్ పై మొదలైన దుమారం ఇంకా చల్లారక ముందే తాజాగా మరోసారి మహిళలను కించపరిచే ఈ వ్యాఖ్యలు చేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/