ఎన్నికల వ్యూహాల్ని రచించటంలోనూ.. వాటిని అమలు చేయటంలోనూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టైల్ వేరుగా ఉంటుంది. తెలుగునేల మీద ఎన్నికల వ్యూహాల్ని పన్నటంలో చంద్రబాబుకు మంచిపేరు ఉంది. కానీ.. ఆయనకు మించిన తెలివి కేసీఆర్ సొంతంగా చెబుతారు. ఎవరిని ఎలా వాడాలో.. ఎప్పుడు వాడాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికి తెలీదన్న మాట తరచూ వినిపిస్తుంది.
పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆయన వ్యూహాలు పక్కా అన్న పేరుకు భిన్నమైన పరిణామాలు తాజాగా జరుగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించిన ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పరిశీలకుడితో అధికార పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి సానుకూలంగా ఉండే అంశాలపైనా ఈసీ డేగకన్నుతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు డేట్ దగ్గరకు వచ్చేస్తున్న కొద్దీ.. టీఆర్ ఎస్ పార్టీ తాను అనుకున్నవి అనుకున్నట్లుగా చేయలేకపోతున్న పరిస్థితి. ముందుగా అనుకున్న దాని ప్రకారం డేట్ వాల్యూ వ్యూహాన్ని ఈసీ పుణ్యమా అని అమలు చేయలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల పలితాల మీద ప్రభావాన్ని చూపించే వాటిల్లో కీలకమైన మద్యం పంపిణీ విషయంలో ఈసీ కఠినంగా ఉండటం.. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వైనం గులాబీ నేతలకు కొత్త కష్టాల్ని తెచ్చి పెడుతోంది.
నాలుగైదు రోజుల క్రితం 200 కాటన్ల మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా సరఫరా అవుతున్న మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం అధికారులు కటువుగా వ్యవహరించటం.. టీఆర్ఎస్ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదిలా ఉంటే.. హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మీద ఎన్నికల సంఘానికి తాజాగా ఫిర్యాదు చేశారు.
అధికార టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో పాటు.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ అధికారులు ఈసీకి సమాచారం అందించారు. మరోవైపు ఈసీ ఆదేశాలతో ఎక్సైజ్ కమిషనర్ రంగంలోకి దిగారు. సీఐ శ్రీనివాస్ ను నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అఫీస్ కు సరెండర్ చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణల్ని విచారించి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ.. ఆ రిపోర్ట్ కానీ తేడా వస్తే ఎక్సైజ్ సీఐకు మరిన్ని చిక్కులు తప్పవంటున్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తమకు ఎదురవుతున్న షాకులతో టీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ లో ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు టీఆర్ఎస్ నేతలకు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.