కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది మేలో జరిగే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్త నిబంధనను అమలు చేయాలని తేల్చింది. పోలింగ్ రోజున ఇప్పటివరకూ మద్యం దుకాణాల్ని బంద్ చేసేవారు. ఇకపై సిగిరెట్ షాపుల్ని కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించిన ఆదేశాల్ని భారత ఎన్నికల సంఘం జారీ చేసింది. దేశ చరిత్రలో తొలిసారి ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ జరిగే వేళలో సిగిరెట్లను విక్రయించే దుకాణాల్ని మూసివేయాలని.. ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.
దీనికి సంబంధించిన ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలకు పంపింది. ఎందుకిలా అంటే.. దేశంలో కేన్సర్ మరణాలకు పొగాకు కారణమని.. ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చేసే సిగిరెట్ల వినియోగం మీద అవగాహన కలిగించేందుకు వీలుగా తాజా నిర్ణయాన్ని తీసుకున్న వెల్లడించింది. పలు రకాల కేన్సర్ లతో పాటు.. పలు ఆరోగ్య సమస్యలకు సిగిరెట్ తాగటం కారణమని.. తాజా నిషేదం నేపథ్యంలో ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని.. అందుకోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అంతేకాదు.. పోలింగ్ వేళ. . ప్రతి పోలింగ్ బూత్ వద్ద పొగాకు.. ధూమపానం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు.. ఎదుర్కొనే ఇబ్బందుల్ని తెలిపే బ్యానర్లను.. ప్రచారసామాగ్రిని పెద్ద ఎత్తున ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటివన్నీ ప్రభుత్వంలోని సంబంధిత శాఖ చూసుకుంటుందిగా? ఇలాంటి వాటి కంటే కూడా ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయన్న విషయం అందరికి అర్థమయ్యేలా ఈసీ చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో?