దేశం మొత్తం ఈసీ మ‌హాస‌ర్వే.. ప్ర‌శ్న‌లివే..!

Update: 2019-02-08 06:01 GMT
ఎన్నిక‌ల వేళ స‌ర్వేలు నిర్వ‌హించ‌టం ఇప్పుడు మామూలుగా మారింది. గ‌తంలో ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా ఒక‌ట్రెండు స‌ర్వేలుతో స‌రిపెట్టిన పార్టీలు.. అధినేత‌లు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏడెనిమిది స‌ర్వేల‌కు త‌గ్గ‌కుండా చేస్తున్న ప‌రిస్థితి. ఇక‌.. ఎన్నిక‌ల గోదాలోకి దిగే అభ్య‌ర్థుల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వారు ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక స‌ర్వే చేయించి.. ఆ రిపోర్ట్‌ల‌ను పార్టీల‌కు ఇచ్చి.. త‌మ‌కు టికెట్ ఇవ్వాలంటూ కోరుతున్న ప‌రిస్థితి. ఇలా స‌ర్వేల హ‌డావుడి ఇలా సాగుతున్న వేళ‌.. వీరికి భిన్నంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ వ్యాప్తంగా ఒక మ‌హా స‌ర్వేను నిర్వ‌హించాల‌ని నిర్ణయించిన విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ ఏ అంశం మీద స‌ర్వే నిర్వ‌హించాల‌ని భావిస్తున్నార‌న్న‌ది చూస్తే.. ఆస‌క్తిక‌ర అంశాలెన్నో ఈసీ త‌న స‌ర్వే టార్గెట్ గా పెట్టుకుంది. ఓటింగ్ ను త‌ప్ప‌నిస‌రి చేయాలా? ఈవీఎంలతో క‌చ్ఛిత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని భావిస్తున్నారా?  లాంటి ప్ర‌శ్న‌లు చాలానే ఉన్న‌ట్లు చెబుతున్నారు.

టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ పొట్టిగా చెప్పాలంటే టిస్ 18 పేజీల స‌ర్వే ప‌త్రాన్ని త‌యారు చేసింది. దీన్ని అన్ని రాష్ట్రాల‌కు పంపి.. వీలైనంత త్వ‌ర‌గా స‌ర్వే పూర్తి చేయాల‌ని ఈసీ భావిస్తుంది. ఇందుకు త‌గ్గ‌ట్లే అన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల సంఘాల‌కు ఆదేశాలు జారీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. ఈ స‌ర్వేను చేసేదెవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌ర్వే బాధ్య‌త‌ను సెస్ (ఆర్థిక‌.. సామాజిక అధ్య‌య‌నాల సంస్థ‌) కు అప్ప‌జెప్పారు.

మ‌హాస‌ర్వేలో భాగంగా ఏపీలోని విజ‌య‌న‌గ‌రం.. విశాఖ‌ప‌ట్నం.. విజ‌య‌వాడ‌.. న‌ర‌స‌రావుపేట‌.. అనంత‌పురం.. తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స‌ర్వేను చేప‌డ‌తారు. తెలంగాణ‌లో ఏ ప్రాంతాల్లో అన్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. ఈ స‌ర్వేలో శాంపిల్ గ్రామాలుగా ఎక్కువ ఓట్లు న‌మోదైన ప్రాంతాల‌తో పాటు.. త‌క్కువ ఓట్లు న‌మోదైన ప్రాంతాల్ని చేర్చారు. మొత్తం 17వేల మంది నుంచి స‌మాచారాన్ని సేక‌రించ‌నున్నారు.

ఏయే అంశాల మీద స‌ర్వే చేస్తారంటే..

+  ఈవీఎంలు కచ్చితమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారా?

+  ఓటింగ్‌ ను తప్పనిసరి చేస్తే బాగుంటుందా?

+  ఎన్నికల్లో కండబలం.. ధన ప్రభావం పెరుగుతున్నాయని భావిస్తున్నారా?

+  గత ఎన్నికల్లో ఓటు వేశారా?

+  ఈ ఎన్నికల్లో మీకు ఓటు ఉందా?..

+  ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు?

+  ఒక ఇంట్లో ఎంతమంది ఓటర్లుగా నమోదు చేసుకొన్నారు?

+  ఓటర్ల జాబితాలో మీ పేరు తొలగించారా?

+ అలా జ‌రిగి ఉంటే మళ్లీ పేరు నమోదు చేసుకున్నారా?

+  ఓట‌రు నమోదు కార్యక్రమం సంతృప్తిగా ఉందా?

+  ఓటరు కార్డు వచ్చిందా?

+ గత ఎన్నికల్లో ఓటు వేశారా?

+  పోలింగ్‌ స్టేషన్‌ సరిగానే ఉందా?

+  ఇటీవలి ఎన్నికల్లో మీరు ఓటు వేశారా?

+  ఓటు వేయ‌టానికి కార‌ణాలు ఏమిటి?

+  దేశ ప‌రిస్థితుల‌ను మారుస్తుంద‌ని భావిస్తున్నారా?  హ‌క్కుగా భావించి ఓటేస్తున్నారా?

+  ఓటు వేసే ముందు అభ్య‌ర్థిని చూశారా?

+  మీరు ఏదైనా పార్టీకి సానుభూతిప‌రులా?

+  ఎవ‌రైనా భ‌య‌పెడితే ఓటు వేస్తున్నారా?

+  మీరు ఓటు వేయ‌టానికి మ‌త‌పెద్ద‌.. కుటుంబ పెద్ద చెప్పినోళ్ల‌కే ఓటేశారా?

+  దేశంలో ఎన్నిక‌లు స్వేచ్చ‌గా జ‌రుగుతున్నాయ‌ని భావిస్తున్నారా?


Tags:    

Similar News