సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి యాభై రోజులు అయిపోయినా పశ్చిమబెంగాల్లో రాజకీయ హింస తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. రాజకీయమైన రౌడీయిజాని పశ్చిమ బెంగాల్ దశాబ్దాలుగా వేదిక అవుతూ ఉంది. ఎప్పుడో లెఫ్ట్ పార్టీలు అక్కడ వరసగా కొన్ని దశాబ్దాల పాటు ఏలిన సందర్భంలో కూడా రాజకీయ హింసకు లోటు లేదక్కడ.
ఆ తర్వాత మమతా బెనర్జీ అధికారాన్ని చేపట్టిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. లెఫ్ట్ పార్టీల వారిని మమతా బెనర్జీ తీవ్రంగా అణిచి వేసింది. రాజకీయ హింస విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా లెఫ్ట్ పార్టీలనే ఫాలో అయ్యిందనే అభిప్రాయాలు వినిపించాయి.
ఇక గత కొంతకాలంలో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉనికి చాటుతూ ఉంది. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. షాకింగ్ రిజల్ట్స్ ను నమోదు చేసింది కమలం పార్టీ. దీంతో టీఎంసీ - బీజేపీల మధ్యన రచ్చ రాజుకుంది. యాభై రోజులు అయినా ఇంకా అది కొనసాగుతూ ఉండటం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కూడా పశ్చిమబెంగాల్ లో రాజకీయ ప్రశాంతత లేకుండా పోయింది. తాజాగా ముర్షిదాబాద్ జిల్లాలో ఒక టీఎంసీ నేతలను కొంతమంది కాల్చి చంపారు! పట్టపగలే ఇలా బహిరంగంగా కాల్చి చంపే రాజకీయాలు అక్కడ కొనసాగుతూ ఉంది. ఒకవైపు బీజేపీ బెంగాల్ లో తమ పార్టీ కార్యకర్తలు అనేక మంది మరణించారని అంటోంది.
టీఎంసీ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబీకులను ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ప్రత్యేకంగా తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితి ఉందక్కడ. ఇరు పార్టీలూ తమ తమ కార్యకర్తలను కోల్పోతూ ఉన్నాయి. రాజకీయ దాడులు, ప్రతిదాడుల ఫలితంగానే ఈ పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా నాగరికత పరంగా ఎదిగింది అనుకున్న పశ్చిమబెంగాల్ లో ఇలా రాజకీయ హత్యలు - దాడులూ జరుగుతుండటం అక్కడి వాస్తవ పరిస్థితికి అద్దం పడుతూ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.