కర్ణాటకలో ఎన్నికల సమరం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని చెప్పవచ్చు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే రాజకీయ నాయకులు విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు.
ఈ నెల 19వ తేదీన కలబుర్గి జిల్లా చించోళి - ధారవవాడ జిల్లా కుందగోళ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా ఇదే నెల 29వ తేదీ 63 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మరో ఆరు నెలల్లో ఇంకోసారి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (బ్యాటరాయునిపుర – కృష్ణభైరేగౌడ, భాల్కి – ఈశ్వర్‌ఖండ్రే) లోక్‌సభకు పోటీ చేశారు.
ఈ ఎన్నికల్లో వారిద్దరు గెలిస్తే ఉప ఎన్నిక తప్పనిసరి. ఈ ప్రక్రియ ముగిసే సమయానికి కాంగ్రెస్ నుంచి ఇంకొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫలితంగా కర్ణాటకలోని ప్రధాన పార్టీల నేతలకు విశ్రాంతి లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఎన్నికలో బిజీబిజీగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క స్థానం అయినా.. రెండు స్థానాలైనా.. ఆయా పార్టీల అధినేతలు ప్రచారం చేయాల్సిన పరిస్థితి.
ఆ రెండు స్థానాలు ఖాళీ కావడంతో..
ఈనెల 19వ తేదీన ఉప ఎన్నిక జరిగే చించోళి, కుందగోళ స్థానాల నుంచి గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులే గెలిచారు. చించోళి ఎమ్మెల్యే డాక్టర్ ఉమేశ్ జాదవ్ రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకుని కలబుర్గి నుంచి లోక్‌సభ బరిలో దిగారు. అదేవిధంగా ధారవాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే సీఎస్ శివళ్లి (53) గత మార్చి 22వ తేదీ గుండెపోటుతో మరణించారు. ఫలితంగా ఆ స్థానం ఖాళీ అయింది. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
ఈనెల 29న 63 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63 స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం 1,361 వార్డుల ఎన్నికలు - బీబీఎంపీలోని రెండు వార్డులు, తుమకూరు మహానగర పాలికెలో ఒక వార్డుతో పాటు మరో 202 గ్రామ పంచాయతీలు - 10 తాలుకా పంచాయతీలకు ఉపఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే ఈనెల 31వ తేదీ ఓట్ల లెక్కింపు.. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.