72 గంట‌లే తుదిగ‌డువు అంటున్న ఈసీ

Update: 2018-10-07 04:28 GMT
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌ కుమార్ కీల‌క అంశాలు వెల్ల‌డించారు. సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిందన్నారు.  రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలో డిసెంబర్‌ ఏడో తేదీన పోలింగ్‌ జరగనుం‍డ‌గా...డిసెంబర్‌ 11వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేప‌థ్యంలో ర‌జ‌త్ కుమార్ వివ‌ర‌ణ ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేంటో ఈసీ స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదని ఆయ‌న తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు - కటౌట్లు తొలగించాలని స్ప‌ష్టం చేశారు.

24 గంటల్లో రైల్వేస్టేషన్ - బస్‌ స్టేషన్లు - విమానాశ్రయాల్లో పోస్టర్లు - బ్యానర్లు తొలగించాలని ర‌జ‌త్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ``ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి - గోడపత్రికలు అతికించాలి. అనుమతి లేకుంటే 72 గంటల్లో వాటిని తొలగించాలి. ఎన్నికల పనుల కోసం నేతలు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదు. ప్రతి జిల్లాలో - సీఈఓ కార్యాలయంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. డిసెంబర్ 7న 119 స్థానాలకు ఒకే సారి పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుంది`` అని పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలన్నారు. ఫిర్యాదులన్నింటిని ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. కొనసాగుతున్న పనుల వివరాలు 72 గంటల్లో కలెక్టర్లు ఎన్నికల సంఘానికి తెలపాలని - కొత్త పనులు ప్రారంభించరాదని ఆదేశించారు. రాత్రి  10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పార్టీలు ప్రచారం చేయకూడదని అన్నారు. ఇప్పటి వరకు కోటి రూపాయలు సీజ్‌ చేశామని కమిషనర్‌ చెప్పారని వెల్లడించారు.ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ నామినేషన్‌ కు పది రోజుల ముందు వరకు కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటర్‌ కార్డుల జారీ మొదలైందని - అర్హులందరికీ ఇస్తామని చెప్పారు.
Tags:    

Similar News