ఏపీ ప్ర‌జ‌ల‌పై విద్యుత్ పిడుగు.. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిపై తీవ్ర భారం..

Update: 2022-03-30 10:31 GMT
ఏపీలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. అయితే.. ఈ బాదుడు ఓ రేంజ్‌లో ఉంది. అది కూడా పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ తి వ‌ర్గాల‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. కోట్ల‌లోనే వారిపై భారం ప‌డ‌నుం ది. ఇది ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త పెంచ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల విద్యుత్ వినియోగాన్ని ప‌రిశీలిస్తే.. వారు.. 100 యూనిట్ల నుంచి 250 యూనిట్ల వ‌ర‌కు కాలుస్తున్నారు. ఇప్పుడు పెంచిన విద్యుత్ చార్జీల‌ను గ‌మ‌నిస్తే.. వీరిపైనే ఎక్కువ‌గా భారం మోపారు. ఇది నిస్సందేహంగా.. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గంపై తీవ్ర ప్ర‌భావం ప‌డేలా చేయ‌నుంది.

ప్ర‌స్తుతం 0-30 యూనిట్లు కాల్చేవారికి యూనిట్ ధ‌ర‌.. రూ.1.45 పైస‌లు ఉండ‌గా.. దీనిని 1.90 పైస‌ల‌కు పెంచారు. అంటే.. యూనిట్‌కు 45 పైస‌లు పెంచారు. ఈ రేంజ్‌లో అంద‌రూ కాలుస్తారు. ఇది పేద‌ల‌కు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కూడా వ‌ర్తిస్తుంది.

ఇక‌, 31-75 యూనిట్లు కాల్చేవారిపై ఒక‌రకంగా.. కొర‌డా ఝ‌ళిపించార‌నే చెప్పాలి. ఈ యూనిట్ల విద్యుత్ను ఏకంగా.. యూనిట్‌కు 91 పైస‌లు(దాదాపు రూపాయి) చొప్పున పెంచేశారు. ఇది అంద‌రూ వినియోగించే విద్యుత్తే.. అంటే.. వంద యూనిట్ల‌లోపే.. భారీ బాదుడు బాదేశారు. ఒక్క యూనిట్‌పై ఏకంగా.. 1.50 చొప్పున భారం పెరిగిపోనుంది. ప్ర‌స్తుతం 31-75 యూనిట్ల వరకు రూ.2.09 పైసల నుంచి రూ.3.00 పెంచారు.  

ఇక‌, 76 -125 యూనిట్ల వరకు రూ.3.10 నుండి రూ.4.50లకు పెంచారు. ఇది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గానికి క‌న్నీళ్లు పెట్టించే విష‌య‌మే. ఎందుకంటే.. యూనిట్‌కు 1.40 పైసలు చొప్పున పెరిగింది. నిజానికి మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. సుమారు 200 యూనిట్ల‌ను కాలుస్తున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో వీరికి షాక్ కొట్ట‌డం ఖాయం.

ఇక,  126-225 యూనిట్ల వరకు రూ.4.43 నుండి రూ.6.00 పెంచారు. దీంతో యూనిట్‌కు రూ.1.57 పైసలు చొప్పున భారం ప‌డింది. ఇది... మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం పై పిడుగు ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. అంద‌రూ.. ఈ ప‌రిధిలోకే వ‌స్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు రూ.1000 బిల్లు వ‌స్తున్న‌వారికి.. ఇక‌, నుంచి రూ.1450 వ‌ర‌కు బిల్లు రానుంది.
Tags:    

Similar News