టీడీపీ నేత - మాజీ ఎమ్మెల్యే ఈలి నాని అలియాస్ వెంకట మధుసూధనరావు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. బేగంపేటలో హరిత ప్లాజాలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఆయన దొరికిపోయారు. ఈ దాడిలో ఈలి నాని సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షలు - సెల్ ఫోన్లు - పలు కార్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్ గా ఈలి నాని వ్యవహరిస్తున్నారు.
హరితప్లాజా సీఎం క్యాంప్ కార్యాలయం పక్కనే ఉండటం విశేషం. మరోవైపు మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు అరెస్టు తర్వాత మరో ఏపీ నేతను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు అయింది.
హరితప్లాజా సీఎం క్యాంప్ కార్యాలయం పక్కనే ఉండటం విశేషం. మరోవైపు మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు అరెస్టు తర్వాత మరో ఏపీ నేతను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు అయింది.